
కబడ్డీలో కొళగల్లు విద్యార్థుల సత్తా
బళ్లారిఅర్బన్: క్రీడా పోటీల్లో గెలుపు ఓటమి అనేది సహజమని, అయితే పోటీల్లో పాల్గొనడమే ముఖ్యం అని జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు నింగప్ప తెలిపారు. మంగళవారం జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పరుగు పందెం, త్రోబాల్, వాలీబాల్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, కబడ్డీ, ఖోఖో తదితర పోటీలను నిర్వహించారు. ముఖ్యంగా కబడ్డీ పోటీల్లో 12 జట్లు పాల్గొనగా, ఫైనల్ పోటీలో పార్వతి నగర్ పాఠశాల విద్యార్థుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. కొళగల్లు పాఠశాల విద్యార్థులు తమ సత్తాను చాటి విజేతగా నిలిచి క్లస్టర్ స్థాయి నుంచి తాలూకా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ ఏడాది క్లస్టర్ స్థాయి పోటీల్లో 12 పాఠశాలల జట్లతో పాటు పీఈ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విరుపాక్షయ్య, తాలూకా అధ్యక్షుడు జగదీష్‌గౌడ్, జిల్లా ఉపాధ్యాయ సంఘం పదాధికారులు పుష్ప, భీమన్న, సుంకన్న, టీపీ ఈఓ పద్మారెడ్డి తిప్పేస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.