
మహిళాభివృద్ధికి పెద్ద పీట
రాయచూరు రూరల్: మహిళల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం ఆర్థికంగా మరింత సహకారం అందించాలనే సదాశయంతో 250 దుకాణాలు ఏర్పాటు చేసిందని ఏడీసీ జిల్లాధికారి శివానంద పేర్కొన్నారు. నగరంలో టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ఆకాంక్ష హత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు తయారు చేసిన స్థానిక ఆహార పదార్థాలకు పెద్ద పీట వేయాలని సూచించారు. మహిళలు తయారు చేసిన ఆహార పదార్థాలు, చిరు తిళ్ల గురించి వివరించారు. వారం రోజుల పాటు జరిగే మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబీన్ మహాపాత్రో, అధికారులు ఉడేద్, నవీన్ కుమార్, లలిత తదితరులు పాల్గొన్నారు.