
గణనాథులకు భలే గిరాకీ
హొసపేటె: వినాయక విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో యువత సందడి చేస్తోంది. మంటపాల్లో విగ్రహాలను ప్రతిష్టించేందుకు ఉత్సవ సమితి సభ్యులు రెండు రోజులు ముందుగానే మంటపాలు ఏర్పాటు చేశారు. నగరంలో రాయబసవ కాలువ గట్టు వద్ద పెద్ద ఎత్తున విగ్రహాలను అమ్మకందార్లు అందుబాటులో ఉంచారు. నగరంలో విజయనగర కాలేజీ రోడ్డు, కాయగూరల మార్కెట్, మెయిన్‌బజార్ తదితర చోట్ల విగ్రహాలను అమ్మకానికి ఉంచారు. ఈ సారి మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఆకృతిని బట్టి ప్రారంభంలో రూ.300 నుంచి రూ.10,000 ధర వరకు అమ్ముతున్నట్లు వ్యాపారస్తుడు జయకుమార్ చిత్రగార్ తెలిపారు. 6 అంగుళాల నుంచి 4 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలను అమ్మకానికి సిద్ధంగా ఉంచామని, ధరలను గత ఏడాది మాదిరిగానే నిర్ణయించామని తెలిపారు.
ప్రతిష్టాపనకు గణపతులు సిద్ధం
రాయచూరు రూరల్: నగరంలో ప్రశాంతంగా వివిధ ప్రాంతాల్లో గణపతులను ప్రతిష్టాపన చేసేందుకు భక్తులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మంగళవారం మార్కెట్‌లో ఉదయం నుంచి గణపతి బప్పా మోరియా అంటూ గణపతి పూజలకు కావాల్సిన పూజా సామగ్రి కొనుగోలుకు ఎగబడ్డారు. ధరలు ఆకాశాన్నంటినా పూజ సామగ్రిని కొనక మానలేదు. అరటి గెల ధర రూ.350 నుంచి రూ.400 వరకు, పూలు మూర ధర రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతుండగా, గణపతుల విగ్రహాలు రూ.500 నుంచి రూ.3,500 వరకు ధరలు పలుకుతున్నాయి.
మార్కెట్‌లో పండగ శోభ
జోరుగా విగ్రహాల కొనుగోళ్లు

గణనాథులకు భలే గిరాకీ

గణనాథులకు భలే గిరాకీ

గణనాథులకు భలే గిరాకీ