
22 ఏళ్లుగా ఈ గుడిలో పూజారిగా పని చేస్తున్నా. ఆచారంగా వస్తున్న పనే నేను చేస్తున్నా. ఎవరూ ఇప్పటిదాకా అభ్యంతరం చెప్పలేదు. ఏనాడూ నాపై ఇలాంటి ఆరోపణలు రాలేదు అంటూ ఆలయ పూజారి నాగభూషణచార్ అంటున్నాడు. ఈలోపు.. ఆ పూజారి తమతోనూ అసభ్యంగా ప్రవర్తించాడంటూ కొందరు సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలకు దిగుతున్నారు.
కర్ణాటక తుమకూరు దేవరాయనదుర్గ కొండ మీద ఆలయ పూజారి నాగభూషణచార్ మీద జరిగిన దాడి నెట్టింట వైరల్ అవుతోంది. కుంకుమ పెట్టే వంకతో తమను అసభ్యంగా తాకాడంటూ ఓ మహిళ.. తన కుటుంబ సభ్యుల సహకారంతో ఆయనపై దాడికి దిగారు. గుడి మెట్ల మీదనే కర్రలతో ఆయన్ని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే..
తానేమీ భక్తులతో అనుచితంగా ప్రవర్తించలేదని ఆయన అంటున్నారు. నా నుంచి ఆశీర్వాదం తీసుకునే సమయంలో భక్తుల మెడకు కుంకుమ రాయడం ఎప్పటి నుంచో చేస్తున్నా. వాళ్లు పొరపాటు పడి నా మీద దాడి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశా అని తెలిపారాయన.
ఇదిలా ఉంటే.. దాడి చేసిన కుటుంబం హసన్ జిల్లాకు చెందిందిగా తెలుస్తోంది. అయితే వాళ్లు పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. దాడికి సంబంధించిన వీడియోను క్షుణ్ణంగా పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.
A group of devotees has been accused of assaulting an elderly priest at a temple on #DevarayanadurgaHill in #Tumakuru Sunday, alleging he inappropriately touched women while applying vermilion.pic.twitter.com/vo4U4QNNpa
— Hate Detector 🔍 (@HateDetectors) August 25, 2025