
యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు
హొసపేటె: తాలూకాలోని నాగేనహళ్లి ప్రాంతంలోని గుడి ఓబళాపుర గ్రామీణ ప్రాంతంలో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆస్తులు, భూములు దోపిడీకి గురవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ, అటవీ, గనుల శాఖ అధికారులతో సహా జిల్లా యంత్రాంగం కూడా కళ్లు మూసుకుంటోంది. చాలా కాలంగా అక్రమ రాతి తవ్వకాలు జరుగుతున్నా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎర్రమట్టిని తవ్వి రవాణా చేస్తున్నారు. జేసీబీ, హిటాచీ యంత్రాల సహాయంతో కొండలను చదును చేసి వ్యవసాయ భూమిగా మారుస్తున్నారు. ఈ విషయంపై అనేక సార్లు అధికారుల దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొండలను పిండి చేస్తున్న వైనం
పట్టించుకోని జిల్లా యంత్రాంగం

యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు