
మట్టి గణపతులనే ప్రతిష్టించాలి
రాయచూరు రూరల్: ఎర్ర బంక మట్టితో వినాయకులను తయారు చేయడంతో పాటు మట్టి గణపతులనే ప్రతిష్టించాలని కలబుర్గి వీరమ్మ గంగ సిరి మహిళా కళాశాల విద్యార్థులు ప్రచారాందోళనకు శ్రీకారం చుట్టారు. విద్యార్థినులు విద్యాభ్యాసంతో పాటు ప్రకృతి సౌందర్య రక్షణకు మట్టి గణపతులను తయారు చేసి విక్రయానికి సిద్ధమయ్యారు. పీఓపీ, రసాయనాలతో కూడిన వినాయకుల ప్రతిష్టాపన, నిమజ్జనం ప్రకృతికి విరుద్ధమని విద్యార్థినులు వివరించారు. పర్యావరణ సంరక్షణకు ముందుండాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు మట్టి గణపతుల తయారీ విధానాన్ని తెలిపినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర కొండా, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి మహేష్ తెలిపారు.
ప్రశాంతంగా పండగ చేసుకోండి
రాయచూరు రూరల్: జిల్లాలో ఈద్ మిలాద్ పండగను ప్రశాంతంగా ఆచరించాలని, డీజేలను నిషేధించినట్లు ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. శనివారం ఎస్పీ భవనంలో మైనార్టీ సోదరులతో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 5న నిమజ్జనం ఉండడంతో పాటు అదే రోజు ఈద్ మిలాద్ పండుగ ఉన్నందున హిందూ ముస్లిం సోదరులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. డీజేల ఏర్పాటును పూర్తిగా నిషేధించామన్నారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
రాయచూరు రూరల్: కొప్పళ నగరంలో గంజాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కొప్పళ గ్రామీణ స్టేషన్ పోలీసులు వెల్లడించారు. కొప్పళ నగరంలో గంజాయిని విక్రయిస్తుండగా నింగప్ప(50), మారుతి(26), రవి(20), నాగప్ప(38) అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దాడి సమయంలో వారి నుంచి సుమారు రూ.25,200 విలువ చేసే 630 గ్రాముల గంజాయిని, 15 గంజాయి మొక్కలను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు.
నీటి సరఫరా వేళలో మార్పులు
హుబ్లీ: హుబ్లీకి నీటిని సరఫరా చేసే అమ్మినబావి నీటి శుద్ధీకరణ యూనిట్‌లోని 33 కేవీ విద్యుత్ వీసీబీ ఆకస్మికంగా మరమ్మతుకు గురి కావడంతో మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈనేపథ్యంలో నగరంలోని అన్ని వార్డులకు నీటి సరఫరా వేళల జాబితాలో మార్పులు చేస్తామని, స్థానికులు సహకరించాలని సంబంధిత ఎస్‌ఈ ఓ ప్రకటనలో కోరారు.
యువత ఆదాయ మార్గాలు అన్వేషించాలి
బళ్లారి అర్బన్: యువత ఉద్యోగం లేదని నిరాశ పడకుండా మంచి ఉద్యోగం దొరికేంత వరకు ఆదాయాన్ని పెంచుకొని జీవన నిర్వహణకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. డాక్టర్ రాజ్‌కుమార్ రోడ్డులో ఓం సాయిరాం రాధాకృష్ణ శెట్టి ప్రారంభించిన స్వర్ణగౌరీ ఫుడ్ అండ్ డ్రైడ్ మసాలా పదార్థాలు, గృహ ఉపయోగ వస్తువులు, రోజు వారి వాడే ఆహార పదార్థాల అంగడిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఇంట్లో కూర్చోరాదన్నారు. ఈ విషయంలో సంఘాలను ఏర్పాటు చేసుకొని లేదా ఏకవ్యక్తిగా ఇలాంటి వ్యాపారాలను అలవరుచుకొని తమ ఆర్థిక పరిస్థితిని బాగు పరుచుకోవాలని హితవు పలికారు. ఆ సంస్థ ప్రముఖులు అనంత్‌కుమార్ శెట్టి, కృష్ణమూర్తి, ఎంజీ బ్రహ్మయ్య, యంకప్ప, న్యాయవాది దుర్గేష్ శివమూర్తి, జగన్నాథ్ ఆచారి, విరుపాక్షయ్య, శ్రీనివాస్, మేఘరాజ శెట్టి పాల్గొన్నారు.
సహకార సంఘం సభ్యుల వార్షిక మహాసభ
చెళ్లకెరె రూరల్: చిత్రదుర్గ జిల్లా సహకార బ్యాంక్ 62వ సర్వసభ్యుల వార్షిక మహాసభ నగరంలోని నగరంలోని శ్రీరామ కళ్యాణ మంటపంలో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ బ్యాంక్ అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డీ.సుధాకర్ మాట్లాడుతూ డైరెక్టర్లు, సభ్యులు, సిబ్బంది వర్గం అందరి కృషి వల్ల బ్యాంక్ అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ఖాతాదారులు బ్యాంక్‌లో రుణాలు పొంది సకాలంలో తిరిగి చెల్లించి బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో చెళ్లకెరె ఎమ్మెల్యే రఘుమూర్తి, డీసీసీ బ్యాంక్ ఉపాధ్యక్షుడు మంజునాథ్, డైరెక్టర్లు, సిబ్బంది వర్గం, సభ్యులు పాల్గొన్నారు.

మట్టి గణపతులనే ప్రతిష్టించాలి

మట్టి గణపతులనే ప్రతిష్టించాలి

మట్టి గణపతులనే ప్రతిష్టించాలి

మట్టి గణపతులనే ప్రతిష్టించాలి