
భక్తిశ్రద్ధలతో రామలింగేశ్వరుడికి పూజలు
రాయచూరు రూరల్: నగరంలో రామలింగేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు జరిగాయి. బస్టాండ్‌లో వెలసిన రామలింగేశ్వర ఆలయంలో ఆదివారం తెల్లవారు జామున పంచామృతాభిషేకం, బిల్వార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ ధర్మకర్తలు బి.విరుపాక్షప్ప, శరణ బసవ కుటుంబ సభ్యులు పూజలు నెరవేర్చారు. పూజా కార్యక్రమంలో గంగాధర, చంద్రశేఖర్, సురేష్, రాము, బసవ, సంతోష్, అనన్యలున్నారు. అనంతరం భక్తులకు, ప్రజలకు అన్నదాసోహం చేశారు. అదేవిధంగా కిల్లే బృహన్మఠంలో అనన్య నాట్యప్రదర్శన చేసి తన ప్రతిభతో అందరినీ అలరించింది.
సంస్కారయుత
జీవితం అవసరం
రాయచూరు రూరల్: మనిషి సంస్కారయుత జీవిత విధానం అలవర్చుకోవాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అభిప్రాయపడ్డారు. ఆదివారం సోమవారపేట మఠంలో నెలరోజుల పాటు అల్లీపుర మహాదేవ తాత ఆధ్యాత్మిక ప్రవచన పఠనం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నతనం నుంచే పిల్లలకు పాండిత్యం, సంస్కృతి, సంప్రదాయం, ఆచార, విచారాలను బోధించాలన్నారు. ప్రవచన పఠనం వల్ల మనిషి శాంతియుత జీవితం గడపవచ్చన్నారు. సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, జాగటగల్ స్వామీజీ, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, జవుళి, ఉదయ్ కుమార్, పాటిల్‌లున్నారు.
బస్‌షెల్టర్ ప్రారంభం
రాయచూరు రూరల్: నగరంలో ప్రజలకు సౌకర్యాల కల్పనకు అధికారులు, ప్రజాప్రతినిధులు నడుం బిగించాలని మరిస్వామి మఠాధిపతి సదానందస్వామి సూచించారు. ఆదివారం నగరంలోని ఆశాపూర్ రోడ్డులో నూతన బస్‌షెల్టర్‌ను ప్రారంభించి మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి నుంచి నిర్మించిన షెల్టర్ వల్ల నగరానికి దూరంగా ఉన్న కాలనీల ప్రజలకు అనుకూలమైందన్నారు. ఈ సందర్భంగా జయన్న, సరోజ, శరణప్ప, నాగేంద్రప్ప, మారుతి, ఉషాలున్నారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
రాయచూరు రూరల్: నగరంలో వివిధ అభివృద్ధి పనులకు విధాన పరిషత్ సభ్యుడు వసంత్‌కుమార్, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ శ్రీకారం చుట్టారు. ఆదివారం నగరంలోని వార్డు నంబర్–34లో ఎంఎల్‌ఏడీపీ ద్వారా రూ.3 లక్షలు, కేకేఆర్‌డీబీ ద్వారా రూ.3 కోట్లతో పలు నిర్మాణ పనులకు భూమిపూజ జరిపారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈసందర్భంగా రజాక్ ఉస్తాద్, తిమ్మప్ప, అబ్దుల్ ఖరీం, మురళి యాదవ్, శ్రీనివాస్, ఉస్మాన్, ఆంజనేయలున్నారు.
300 ఆటోలకు క్రమసంఖ్యల కేటాయింపు
రాయచూరు రూరల్: నగరంలో 300 ఆటోలకు సీరియల్ నంబర్లను కేటాయించినట్లు ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. శనివారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్ల లైసెన్సులు, పర్మిట్లు, ఆర్సీ, ఇతర బ్యాడ్జీలు, ఎలాంటి పర్మిషన్ లేని ఆటోలను తనిఖీ చేసి వాటికి వరుస క్రమంలో నంబర్లు కేటాయించామన్నారు. నగరంలో దాదాపు 75 శాతం ఆటోలకు ఇన్సూరెన్సులు, ఇతరత్ర పత్రాలు లేవన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శాంతవీర, సీఐ మేకా నాగరాజ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఈరేష్ నాయక్‌లున్నారు.

భక్తిశ్రద్ధలతో రామలింగేశ్వరుడికి పూజలు

భక్తిశ్రద్ధలతో రామలింగేశ్వరుడికి పూజలు

భక్తిశ్రద్ధలతో రామలింగేశ్వరుడికి పూజలు

భక్తిశ్రద్ధలతో రామలింగేశ్వరుడికి పూజలు

భక్తిశ్రద్ధలతో రామలింగేశ్వరుడికి పూజలు