
మండ్య జిల్లాలో షూటౌట్
మండ్య: నగల దుకాణాన్ని లూటీ చేయడంతోపాటు వృద్ధుడిని హతమార్చిన ఉదంతంలో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ఈఘటన శుక్రవారం మళవళ్లి తాలూకా బీమనహళ్లిలో జరిగింది. మండ్య జిల్లా మళవళ్లి తాలూకా కిరుగావలులో మహాలక్ష్మి బంగారు నగల దుకాణం ఉంది. ఈనెల 16న రాత్రి దుండగులు గ్యాస్ కట్టర్‌తో షట్టర్ తొలగించి 110 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి చోరీ చేశారు. అదే సమయంలో దుకాణం పక్కన హోటల్ నిర్వహిస్తున్న మహదేవప్ప(65) దొంగలను చూశాడు. తమ నేరాన్ని ఎక్కడ బయట పెడతాడోనని దుండగులు అతన్ని గొంతు నులిమి హత్య చేశారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు భీమనహళ్లిలో తలదాచుకున్నట్లు పక్కా సమాచారంతో సీఐ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి వెళ్లాడు. లొంగిపోవాలని హెచ్చరికలు చేయగా నిందితుల్లో ఒకరైన కిరణ్ చాకుతో పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో సీఐ తన రివాల్వర్‌తో కాల్పులు జరపగా ఒక తూటా కిరణ్ కాలులోకి దూసుకెళ్లింది. గాయపడిన ఈచగెరె గ్రామానికి చెందిన నిందితుడు కిరణ్(24), కొత్తత్తి గ్రామానికి చెందిన ఆనంద్, శరత్, శ్రీనివాస్, కృష్ణాచారిని అరెస్ట్ చేశారు. కిరణ్‌ను మిమ్స్‌కు తరలించారు.
దోపిడీదారులపై పోలీసుల కాల్పులు
ఒకరికి గాయాలు
ఐదుగురి అరెస్ట్

మండ్య జిల్లాలో షూటౌట్