
భూ వివాదం.. తండ్రీ తనయులపై దాడి
కోలారు : భూ వివాదం నేపథ్యంలో తండ్రీకొడుకులపై కొందరు వ్యక్తులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన బంగారుపేట తాలూకా దాసరహొసహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. దాసరహొసహళ్లి గ్రామానికి చెందిన తండ్రీ కుమారులు మంజునాథ్, నవీన్‌కుమార్‌లకు అదే గ్రామానికి చెందిన కొందరితో ఎనిమిది గుంట్ల స్థలంపై వివాదం ఉంది. గురువారం తండ్రీ కొడుకులు పొలం నుంచి వస్తుండగా మురళి, సతీష్‌గౌడ, గిరీష్‌గౌడ, నారాయణప్పలు దాడి చేశారు. ఈమేరకు బాధితులు ఆస్పత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ప్రాణాలకు ముప్పు వస్తే వీరే కారణమన్నారు. బంగారుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.