
నేటి నుంచి యూత్ ఫొటోగ్రఫీ
బనశంకరి: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నేటి నుంచి బెంగళూరులోని చిత్రకళా పరిషత్‌లో యూత్ ఫొటోగ్రఫిక్‌సొసైటీ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన శనివారం నుంచి నగరవాసులను సందడి చేయనుంది. ఫొటోగ్రఫీపై ఆసక్తి కలిగిన ఔత్సాహికులు తమ ప్రతిభ కనబరచడానికి జాతీయ, అంతర్జాతీయ వేదికలో గుర్తింపు పొందడానికి ఆ సంస్థ ఈ వేదికను ఏర్పాటు చేసింది. యూత్ ఫొటోగ్రఫిక్ సభ్యులు తమ కెమెరాల్లో బంధించిన పనోరమ ఛాయాచిత్రాలను ప్రదర్శన ఉంటుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు కాన్వాస్ ఛాయాచిత్రాల ప్రదర్శన. ఫొటోబూత్–కుటుంబ చిత్రాలను తీసి ఫ్రేమింగ్ చేసే అవకాశం, షూట్, షేర్ అండ్ విన్, క్రీడా స్థలాల్లో కెమెరా, మొబైల్ వినియోగించి తీసిన చిత్రాలను ప్రదర్శించి బహుమతులు గెలుపొందవచ్చు. ప్రతి ఒక్కరూ హాజరుకావచ్చని సంస్థ అధ్యక్షుడు మంజు వికాస్ శాస్త్రి, గిరీశ్‌అనంతమూర్తి,ప్రేమ్‌కాకడే తెలిపారు.