జొన్నల కొనుగోలు కోసం రైతుల ఆందోళన
రాయచూరు రూరల్: రైతులు ఖరీఫ్ సీజన్‌లో పండించిన జొన్నలను కొనుగోలు చేయాలంటూ రైతులు వారం రోజుల నుంచి ఆందోళనకు దిగారు. సోమవారం సింధనూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది రైతులతో ఆందోళన, బంద్ చేపట్టిన సందర్భంగా అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ మాట్లాడారు. అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు కేంద్రాలను బంద్ చేసి జొన్నల కొనుగోళ్లను నిలిపివేయడాన్ని తప్పుబట్టారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద డీహెచ్ పూజార్ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు. మూడు గంటల పాటు రాస్తారోకో చేయడంతో వాహన రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. కాగా సింధనూరు బంద్‌కు రైతులు, న్యాయవాదులు, వ్యాపారులు మద్దతు పలకడంతో విజయవంతమైంది.
సింధనూరు బంద్ విజయవంతం
న్యాయవాదులు, వ్యాపారుల మద్దతు
జొన్నల కొనుగోలు కోసం రైతుల ఆందోళన


