ప్రేమకు ప్రతిరూపం క్రిస్మస్
బనశంకరి: ప్రేమకు ప్రతిరూపం క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆనందంగా జరుపు కొంటున్నారని తెలుగు బాప్టిస్ట్ చర్చి (టీబీసీ) పాస్టర్ రెవరెండ్ ఎం.బీ.మోసెస్ తెలిపారు. ఆదివారం రాత్రి రామచంద్రపురలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. తెలుగు క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సమాజంలో అసమానతల తొలగింపునకు కరుణామయుడు ఏసుక్రీస్తు పోరాటం చేశారని, శాంతి, ప్రేమలతో కూడిన సమాజం కోసం శ్రమించారని తెలిపారు. ఈ సందర్భంగా బాలలు క్రీస్తు జన్మవృత్తం నృత్యనాటికతో పాటు మహిళలు ఆంధ్ర క్రైస్తవ గీతాలను ఆలపించారు. పాస్టర్లు కేఎన్.రావు, బాలసుందరం తదితరులు పాల్గొన్నారు.
ప్రేమకు ప్రతిరూపం క్రిస్మస్


