సాగు రుణాలు మెండుగా ఇవ్వండి
కోలారు: వ్యవసాయ తదితర రుణాలను ప్రాధాన్యత క్రమంలో విరివిగా అందించాలని జెడ్పీ సీఈఓ ప్రవీణ్ బాగేవాడి తెలిపారు. సోమవారం జెడ్పీ భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగానికి అధికంగా రుణాలు అందించాలన్నారు. అటల్ పింఛన్ పథకం లక్ష్యాన్ని సాధించిన బ్యాంకర్లను ఆయన అభినందించారు. పీఎంజేజేవై, పీఎంఎస్‌బీవై పథకం కింద అధికంగా ప్రజలను చేర్చాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రధానమంత్రి సురక్షా పథకం వార్షిక ప్రీమియం రూ.20, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో ప్రతి త్రైమాసికానికి ఉన్న వార్షిక ప్రీమియం రూ.436లను వినియోగదారులు చెల్లించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద అధికంగా రుణాలు అందించాలన్నారు. సమావేశంలో ఆర్‌బీఐ ఎల్‌డీఈ సిల్వియా గౌతం, నబార్డు డీడీఎం హిమాంశు శుక్లా, కెనరా బ్యాంకు ప్రాంతీయ ప్రముఖుడు అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకర్లకు జెడ్పీ సీఈఓ సూచన


