శిథిలావస్థలో బీఈఓ కార్యాలయం
రాయచూరు రూరల్ : విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే పాఠశాలలకు తోడు తాలూకా విద్యాశాఖాధికారి (బీఈఓ) కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. బీఈఓ కార్యాలయానికి 50 ఏళ్లు దాటినా భవనానికి మరమ్మతులు మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. తాలూకా కార్యాలయం పైకప్పు పెచ్చులూడుతున్నాయి. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు ఏ రోజునా కూడా కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ, జిల్లా విద్యాశాఖాధికారి కూడా కార్యాలయం స్థితిగతుల గురించి ఏనాడూ పరిశీలించిన సందర్భాలు లేవు. ఇటీవల కురిసిన వానలకు భవనంపై నీరు నిలబడి కారడంతో పెచ్చులూడి కిందకు పడగా సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
బిక్కుబిక్కుమంటూ విధులు..
అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏ సమయంలో పెచ్చులూడి తమపై పడతాయోననే భయంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. తాలూకా విద్యా శాఖాధికారి కార్యాలయం ముందు భాగంలో పెచ్చులూడి పడ్డాయి. నూతన జిల్లాధికారి కార్యాలయం మినీ విధానసౌధకు తరలి పోవడం నగరసభ కార్యాలయం పాత జిల్లాధికారి కార్యాలయానికి తరలించారు. అందులోకి బీఈఓ కార్యాలయాన్ని తరలించడానికి అవకాశం కల్పిం చాలని బీఈఓ ఈరణ్ణ కోస్గి జిల్లాధికారి నితీష్‌కు లేఖ రాసి 45 రోజులు గడుస్తున్నా నేటికీ జిల్లాధికారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు, సిబ్బంది వాపోయారు.
త్రుటిలో సిబ్బందికి తప్పిన ప్రమాదం
50 ఏళ్లు దాటినా మరమ్మతులు శూన్యం
శిథిలావస్థలో బీఈఓ కార్యాలయం


