అటవీశాఖ రాయబారిగా అనిల్ కుంబ్లే
● మంత్రి ఈశ్వర ఖండ్రె
శివాజీనగర: మాజీ క్రికెట్ క్రీడాకారుడు అనిల్ కుంబ్లేను అటవీ, వన్యజీవి రాయబారిగా నియమించినట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. మంగళవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో కర్ణాటక వన్యజీవి మండలి ఉపాధ్యక్షుడిగా అనిల్ కుంబ్లే సేవలు అందించారన్నారు. ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అటవీ సంరక్షణ, అటవీ సంవర్ధక, వన్య సంరక్షణ, వన్యజీవి సంరక్షణపై ప్రజల్లో జాగృతి కల్పించేందుకు రాయబారిగా ఎంపిక చేశామన్నారు. అనిల్ కుంబ్లెకు వన్యజీవులపై అపారమైన ఆసక్తి ఉందన్నారు. ఆయన ఎలాంటి పారితోషకం తీసుకోకుండా రాయబారిగా ఉండేందుకు అంగీకరించారన్నారు.


