మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు | - | Sakshi
Sakshi News home page

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు

May 27 2025 12:48 AM | Updated on May 27 2025 12:48 AM

మరో 9

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు

బోవి మండలి స్కాంలో

ఆస్తుల జప్తు

బనశంకరి: కర్ణాటక రాష్ట్ర బోవి అభివృద్ధి మండలిలో వందలాది కోట్ల రూపాయల కుంభకోణంలో నిందితులకు చెందిన రూ.26.27 కోట్ల విలువచేసే స్థిరాస్థిని ఈడీ జప్తు చేసింది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఈ ఆస్తి విలువ రూ.40 కోట్లు ఉంటుంది. ఈ కేసులో బీకే.నాగరాజప్ప, ఆర్‌.లీలావతి తదితరులకు చెందిన ఆస్తిని ఈడీ అటాచ్‌ చేసింది. బోవి మండలికి చెందిన నగదు బదిలీ ద్వారా ఆస్తులను పొందారని ఈడీ పేర్కొంది.

పులి పంజా..

నవ వివాహితుడు బలి

మైసూరు: పులి దాడి చేసిన ప్రమాదంలో ఇటీవలే పెళ్లయిన యువకుడు బలయ్యాడు. మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకా గురుపుర గ్రామంలో జరిగింది. 5వ బ్లాక్‌లో

హరీష్‌ (24) నివాసం ఉంటున్నాడు, సోమవారం ఊరి శివార్లలో అడవిలో మేకలను మేపుతున్న సమయంలో పులి దాడి చేసింది. యువకుడు గట్టిగ కేకలు వేశాడు. స్థానికలు వచ్చేలోగా పులి అతనిని చంపి పారిపోయింది. తీవ్రగాయాలతో పడి ఉన్న హరీష్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు, వైద్యులు పరిశీలించి చనిపోయినట్లు తెలిపారు. హుణసూరు గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. హరీష్‌కు 8 నెలల కిందటే పెళ్లి అయ్యిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

28 నుంచి చిత్ర సంతె–2

చిత్రకళాపరిషత్‌లో 5 రోజులు ప్రదర్శన

బనశంకరి: చిత్రసంతె తరహాలో మరో చిత్ర ప్రదర్శన జరగనుందని నగరంలోని చిత్రకళా పరిషత్‌ అద్యక్షుడు బీఎల్‌.శంకర్‌ తెలిపారు. సోమవారం పరిషత్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 28వ తేదీ నుంచి 5 రోజుల పాటు నమ్మ ఆర్ట్స్‌ బెంగళూరు జాతీయ కళా ఉత్సవం – 2025 జరగుతుందన్నారు. ప్రముఖ కళాకారులు గీసిన చిత్రాల ప్రదర్శన, విక్రయాలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవంలో 100 మందికి పైగా చిత్రకారులు పాల్గొంటారని, దుకాణాలు, గ్యాలరీలో ప్రదర్శన కల్పించామని తెలిపారు. కర్ణాటక నుంచి 51 మంది చిత్రకారులు పాల్గొంటున్నారని, మిగతావారు ఇతర రాష్ట్రాల వారని తెలిపారు. ప్రతి ఏడాది ఇలాంటి ప్రదర్శనను నిర్వహిస్తామన్నారు.

మలప్రభ, కృష్ణా నదుల జోరు

రోడ్లు, వంతెనలు జలార్పణం

దొడ్డబళ్లాపురం: బెళగావిలోని పశ్చిమఘాట్ల ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో మలప్రభ నది పొంగిప్రవహిస్తోంది. దీంతో ప్రధాన రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. ముఖ్యంగా బెళగావి–గోవా ప్రధాన రహదారి తెగిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. బెళగావి, ఖానాపుర, రామనగర మార్గాల్లో చాలాంది గోవాకు వెళ్లేవారు. అయితే ఈసారి వర్షాకాలం ముగిసే వరకూ ఈ మార్గాన్ని మూసివేసే అవకాశం ఉంది. మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానదిలో నీటి ప్రవాహం రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాగే కొనసాగితే బెళగావి చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లో ముంపు ఏర్పడే ప్రమాదముంది.

సైన్యానికి దత్తపీఠం

రూ.25 లక్షల విరాళం

మైసూరు: ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో మైసూరు దత్తపీఠం భారత సైన్యానికి రూ. 25 లక్షలు విరాళం ఇచ్చింది. మైసూరులోని దత్తానగర్‌లోని ఆశ్రమంలోని నాద మంటపంలో గణపతి సచ్చిదానంద స్వామి, చిన్నదత్త విజయానంద తీర్థ స్వామీ వేద పఠనం ద్వారా దత్త వెంకటేశ్వర బ్రహ్మోత్సవ వేద పారాయణాన్ని సోమవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మైసూరు– కొడగు ఎంపీ యదువీర్‌ క్రిష్ణదత్త ఒడెయార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సచ్చిదానందస్వామి భారత సైన్యానికి రూ. 25 లక్షలు విరాళం చెక్కును ఎంపీ యదువీర్‌కి అందజేశారు. నారాయణ మూర్తి, మంజుల చెల్లూరు, టీఎస్‌ శ్రీవత్స ఉన్నారు.

ముఖంపై స్ప్రే కొట్టి

నగల దోపిడీ

దొడ్డబళ్లాపురం: మహిళ మొహానికి స్ప్రే కొట్టిన దుండగులు ఆమె మెడలోని బంగారం మాంగల్యం చైను, కమ్మలు దోచుకుని పరారైన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా నందరామయ్యనపాళ్యలో చోటుచేసుకుంది. అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న లక్ష్మి, ఇంటి ముందు ఉండగా అక్కడకు వచ్చిన ఇద్దరు దుండగులు అడ్రస్‌ చెప్పాలని ఆమె దగ్గరకు వచ్చారు. వెంటనే ఆమె ముఖంపై ఏదో స్ప్రే కొట్టి బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. సుమారు రూ.1.80లక్షల విలువైన నగలు పోయినట్టు లక్ష్మి మాదనాయకనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మైసూరు శాండల్‌ నకిలీ సోపుల తయారీ

శివాజీనగర: కేఎస్‌డీఎల్‌ సంస్థ విషయంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర కన్నడ అభిమానం గురించి మాట్లాడుతున్నారు. ఆయనతో కన్నడ అభిమానం గురించి చెప్పించుకోవాల్సిన అవసరం లేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బీ.పాటిల్‌ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన మైసూరు శాండల్‌ వ్యాపారం పెంచడం కోసమే హిందీ నటి తమన్నా భాటియాను ప్రచార రాయబారిగా ఎంపిక చేశామన్నారు. హైదరాబాద్‌లో కొందరు నకిలీ మైసూరు శాండల్‌ సోప్‌ తయారు చేస్తున్నారు, దానిని బంద్‌ చేయించాం. మళ్లీ తయారు చేస్తున్నారని తెలిసింది, దీనిపై చర్యలు తీసుకొంటామని మంత్రి తెలిపారు.

నగరసభపై లోకాయుక్త దాడి

దొడ్డబళ్లాపురం: దొడ్డ నగరసభలో లోకాయుక్త దాడి జరిగింది. సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా వచ్చిన లోకాయుక్త పోలీసులు నగరసభ కార్యాలయంలోకి వెళ్లి దాఖలాల పరిశీలన చేపట్టారు. లోపల ఉన్న అధికారులను లోపలే ఉంచి తలుపులు వేశారు. ఈ–ఖాతాల మంజూరులో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపనలు వచ్చాయి. దీనిపై ప్రజాసంఘాలు కూడా ధర్నాలు చేశాయి. దీంతో లోకాయుక్త దాడి చేసినట్టు తెలుస్తోంది.

బనశంకరి: రాష్ట్రంలో కోవిడ్‌ వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల అవధిలో కేసుల సంఖ్య 47కు చేరుకోగా ఒకరు చనిపోయారు. దీంతో రెండురోజుల్లో రెండు మరణాలు సంభవించాయి. రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ వైద్యసిబ్బందిని ఆదేశించింది.

ఎక్కువ మంది ఇంట్లోనే

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 47 కు చేరుకోగా 46 మంది రోగులు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యశాఖ గత 24 గంటల్లో 104 మందికి కరోనా పరీక్షలు చేపట్టగా 9 కొత్త కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్‌ శాతం 8.65 కు చేరుకుంది. రాష్ట్రంలో ఎలాంటి కొత్త రూపాంతర వైరస్‌ కనబడలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. పొరుగున కేరళలోనూ కేసులు గణనీయంగా పెరిగాయి.

బెంగళూరు సౌత్‌లో అధికం

● గత 24 గంటల్లో 96 ఆర్‌టీ పీసీఆర్‌తో పాటు మొత్తం 104 మంది శాంపిల్స్‌ను సేకరించి కొత్త వైరస్‌ వేరియంట్లు వచ్చాయా అని పరీక్షించారు.

● ఈ ఏడాది రాష్ట్రంలో 98 కోవిడ్‌ కేసులు రాగా, 50 మంది రోగులు కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.

● బెంగళూరులో 71 కోవిడ్‌ కేసులు ఉంటే, అందులో మహదేవపుర వలయం కరోనా హాట్‌ స్పాట్‌గా నిలిచింది. సిటీ దక్షిణ జోన్‌లో తీవ్రత బాగా ఉంది. మహదేవపుర వలయంలో 16, దక్షిణ వలయంలో 14, బొమ్మనహళ్లి 7 , బెంగళూరు కేంద్ర 5, యలహంక 4, బెంగళూరు తూర్పు 13, బెంగళూరు పశ్చిమ 10, ఆర్‌ఆర్‌.నగర 1 కేసు నమోదయ్యాయి.

● నిమ్హాన్స్‌, బెంగళూరు మెడికల్‌ కాలేజీతో పాటు రాష్ట్రంలో 10 మెడికల్‌ కాలేజీల్లో కోవిడ్‌ టెస్టులు చేస్తున్నారు. రోజుకు 150–200 టెస్టులు చేయాలని సూచించారు.

మాస్కు తప్పనిసరి కాదు!

బెంగళూరు పాలికె కమిషనర్‌ మహేశ్వర్‌రావ్‌ 8 వలయాల కమిషనర్లతో కరోనా కట్టడి చర్యల గురించి చర్చించారు. కోవిడ్‌ ఉధృతం కాకుండా చూడాలి, ఆసుపత్రులకు వచ్చే వృద్ధులు, గర్భిణీలు పిల్లలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. నగర పాలికె ఆసుపత్రులకు వచ్చే రోగులు మాస్కు ధరించాలని ప్రచారం చేశారు. శ్వాసకోశ జబ్బులు ఎక్కువగా ఉండేచోట ప్రత్యేక వైద్యసేవలు అందించాలన్నారు. నమ్మ మెట్రో రైలులో ఇంకా మాస్కు తప్పనిసరి చేయలేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాస్కు గురించి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు.

న్యూస్‌రీల్‌

రాష్ట్రంలో మొత్తం 47 మందికి పాజిటివ్‌

కొత్త వేరియంట్‌ కనబడలేదు

బడుల రీ ఓపెన్‌ మార్పు?

కోవిడ్‌ పరిస్థితిని మూడు నాలుగు రోజులు గమనించి స్కూళ్లు, కాలేజీల పునః ప్రారంభం గురించి నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండూరావ్‌ తెలిపారు. ఇప్పటి కరోనా వైరస్‌ ప్రమాదకరం కాదని చెప్పారు. నిజానికి 29వ తేదీ నుంచి పాఠశాలు ప్రారంభం కావాల్సి ఉంది. కేసులు పెరిగితే స్కూళ్ల రీఓపెన్‌ను వాయిదా వేసే అవకాశముంది.

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు1
1/6

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు2
2/6

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు3
3/6

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు4
4/6

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు5
5/6

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు6
6/6

మరో 9 కోవిడ్‌ కేసుల నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement