రెండు జిల్లాల్లో భారీ వర్షాలు
హొసపేటె: అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. విజయనగర, రాయచూరు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. విజయనగర జిల్లా హొస్పేటలో ఆదివారం ఉదయం గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల కాలువలై ప్రవహించాయి. వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభించింది. ఇళ్లలోకి వర్షం నీరు చొరబడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవడంతో వంకలు, వాగులు ఏరులై ప్రవహించాయి.
రాయచూరురూరల్: రాయచూరులో అదివారం భారీ వర్షం కురిిసింది. రహదారులు జలమయం అయ్యాయి. గాంధీచౌక్, బసన బావి చౌక్, అంద్రూన్ కిల్లాలో వర్షపు నీరు పోటెత్తింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. టిప్పు సుల్తాన్ రహదారిలోని దుకాణంలోకి నీరు చేరి వస్తువులు తడిసిపోయాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహించడంతో దుర్వాసనతో వెదజల్లింది. రోడ్లలో మోకాలు లోతు నీరు ప్రవహించాయి.
విజయనగర, రాయచూరు
జిల్లాల్లో స్తంభించి జనజీవనం
రెండు జిల్లాల్లో భారీ వర్షాలు
రెండు జిల్లాల్లో భారీ వర్షాలు
రెండు జిల్లాల్లో భారీ వర్షాలు


