పాకిస్తానీలందరూ వెళ్లిపోయారు
మండ్య: పాకిస్తాన్ మీద భారతదేశం కార్యాచరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అన్ని ఆనకట్టలకు గట్టి భద్రత కల్పించినట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఆయన గురువారం జిల్లాలో పర్యటించి మద్దూరు తాలూకా గెజ్జలగెరె హెలిప్యాడ్ వద్ద విలేకరులతో మాట్లాడారు. డ్యాంల భద్రతకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ఎంత మంది పాకిస్తానీయులు ఉన్నారో నికరమైన సమాచారం లేదన్నారు. అయితే పాకిస్తానీలందరూ దేశాన్ని విడిచి వెళ్లారన్నారు. మైసూరులోని పాకిస్తానీలు కోర్టును ఆశ్రయించినందున వారు మాత్రమే మిగిలి ఉండవచ్చని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. దేశం కోసం అన్ని ఆలయాల్లో పూజలు చేయిస్తున్నట్లు తెలిపారు.
మైసుగర్‌కు తాయిలాలు
మండ్య మైసుగర్ కర్మాగారానికి రూ.50 కోట్లు ఇవ్వడమేగాకుండా విద్యుత్ బిల్లు, జరిమానాలను మాఫీ చేశామని సీఎం తెలిపారు. కురుబ సంఘం ఆవరణలో కొత్త హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు ప్రజలకు అబద్ధాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయస్వామి, నగరాభివృద్ధి మంత్రి బైరతి సురేష్, కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఆందోళనకారుల అరెస్టు
సిద్దరామయ్య అణగారిన వర్గాలను మోసగిస్తున్నారని నల్లజెండాలను ప్రదర్శించిన దళిత సంఘర్ష సమితి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం మండ్య నగర పర్యటన నేపథ్యంలో నగరంలోని జయచామరాజేంద్ర ఒడెయర్ సర్కిల్‌లో సమితి కార్యకర్తలు నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు సీఎం పర్యటనకు ముందే 50 మంది కార్యకర్తలు, నేతలను అడ్డుకుని తరలించారు.
రాష్ట్రంలో ఎంతమంది
ఉన్నారో తెలియదు
మండ్య పర్యటనలో సీఎం సిద్దు


