శుభప్రదం.. ఆలయ దర్శనం
మైసూరు/ శివాజీనగర: గత ఏడాది కంటే కొత్త సంవత్సరంలో మరింత మంచి జరగాలని, అన్నీ కలసిరావాలని కోరుకుంటూ ప్రజలు ఆలయాల బాట పట్టారు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా గురువారం తెల్లవారుజాము నుంచే బెంగళూరు, మైసూరు వంటి నగరాలతో పాటు పట్టణాలు, గ్రామాలలో ఆలయాలు, దేవస్థానాలు భక్తజనంతో కిటకిటలాడాయి. టెంకాయలు, పూలు, పండ్లకు విపరీతమైన గిరాకీ నెలకొంది. బెంగళూరులో హలసూరు సోమేశ్వరాలయం, బసవనగుడి దొడ్డ గణపతి మందిరం, బనశంకరీదేవి ఆలయం వంటి ప్రసిద్ధ ఆలయాలలో విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా విశేష అలంకారాలు గావించారు. నగరం నలుమూలల నుంచి భక్తులు వచ్చి దేవీ దేవతలను దర్శించుకుని పూజలు చేశారు. రద్దీ ఉండడంతో సుదీర్ఘంగా బారులు తీరారు.
మైసూరులో చాముండి కొండపై భక్తసంద్రం
కొత్త సంవత్సరం తొలిరోజున మందిరాలు కిటకిట
ఏడాదంతా మంచి జరగాలని
జనం పూజలు
చాముండి గిరుల వైభవం
మైసూరులో చాముండి గిరుల మీద చాముండేశ్వరి దేవి సన్నిధిలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. మైసూరుతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు రావడంతో కొండ నిండిపోయింది. తెల్లవారుజామునే తల్లి చాముండేశ్వరికి విశేష పూజలు నిర్వహించారు. అలంకారం, అభిషేకం, మంగళారతి సేవలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. శక్తి దేవత సన్నిధికి కేరళ, తమిళనాడు వంటి బయటి రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చారు. నూతన సంవత్సరంలో తొలిరోజు అమ్మవారి దర్శనం ఎంతో శుభప్రదమని నమ్ముతారు. చాముండేశ్వరికి
అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి, ఆమెను వివిధ పువ్వులు, విల్లో ఆకులతో చేసిన దండతో అలంకరించారు. రుద్రాక్ష మంటపంలో ప్రతిష్టించిన చాముండేశ్వరి విగ్రహ ప్రత్యేక అలంకరణ చూసి భక్తులు తరించిపోయారు. ఆలయం మొత్తం మనోహరంగా సింగారించారు. పొగమంచు, చలి తీవ్రతను కూడా లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే కొండపైకి భక్తులు క్యూలు కట్టారు. ఆలయంలో పూజల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి బయట ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ నటీనటులు దర్శనానికి వచ్చారు.
శుభప్రదం.. ఆలయ దర్శనం
శుభప్రదం.. ఆలయ దర్శనం
శుభప్రదం.. ఆలయ దర్శనం
శుభప్రదం.. ఆలయ దర్శనం


