నేనే బడ్జెట్ సమర్పిస్తా: సీఎం
బనశంకరి: ఈ ఏడాది కూడా నేనే బడ్జెట్‌ను ప్రవేశపెడతానని, ఈ నెల నుంచి సన్నాహాలు చేపడతామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. విధానసౌధలో ఉన్నతాధికారులు సీఎంను కలిసి నూతన ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం సిద్దు విలేకరులతో మాట్లాడుతూ కన్నడ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈదఫా కూడా మీరే బడ్జెట్‌ను సమర్పిస్తారా? అని విలేకరులు ఆయనను ప్రశ్నించారు. ఇందుకు సమాధానమిస్తూ ఈ నెల నుంచి బడ్జెట్ తయారీకి కసరత్తు చేపడతానన్నారు. దీనిని బట్టి సీఎం మార్పు ఇప్పట్లో ఉండదని పరోక్షంగా ప్రకటించారు. మామూలుగా ఫిబ్రవరి చివరి వారం, లేదా మార్చి మొదట్లో బడ్జెట్‌ను సమర్పిస్తారు. అత్యధికసార్లు బడ్జెట్‌ను ప్రకటించిన ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యకు ఇదివరకే పేరు ఉంది.
నేనే బడ్జెట్ సమర్పిస్తా: సీఎం


