మధుమేహంపై అవగాహన కల్గిస్తాం
రాయచూరు రూరల్: మధుమేహ వ్యాధిపై పాఠశాల స్థాయిలో పిల్లలకు అవగాహన కల్గింపనున్నట్లు రిసెర్చి సొసైటీ స్టడీ ఆఫ్ డయాబిటీస్ ఆఫ్ ఇండియా కర్ణాటక(ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ) చాప్టర్ అధ్చక్షుడు డాక్టర్ బసవరాజ్ పాటిల్ వెల్లడించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో జీవన విధానంలో, ఆహార పదార్థాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా మధుమేహ వ్యాధి వ్యాపిస్తోందన్నారు. భవిష్యత్తులో 9, 10, 11, 12వ తరగతులు విద్యనభ్యశించే విద్యార్థులకు మధుమేహ వ్యాధిపై ముమ్మర ప్రచారం చేపడుతామన్నారు. ఈ విషయంలో శనివారం రిమ్స్‌లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. శిబిరాన్ని రిమ్స్ డీన్ రమేష్, భారతీయ వైద్యకీయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చినివాలర్, హరి ప్రసాద్, నేహా, మంజునాథ్, సంజీవ్‌చెట్టి, మనోహర్, కార్తీక్ పాల్గొంటారన్నారు. మహాలింగ, రామకృష్ణ ఎస్‌ఎస్ రెడ్డి, నాగభూషణ్, తదితరులు పాల్గొన్నారు.


