హుబ్లీ: ౖవెద్య శిబిరాలు ప్రజలకు వరమని, వీటిని రోగులు వినియోగించుకోవాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ సూచించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో బెళగావి జిల్లా సౌదత్తి తాలూకా మైదానంలో ఏర్పాటు చేసిన బృహత్ ఆరోగ్య మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. సౌదత్తి ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో మేళను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎంతో దూరం నుంచి వచ్చిౖ వెద్య సేవలు పొందారన్నారు. వైద్య శిబిరం విజయవంతమైందన్నారు. షుగర్, బీపీ బాధితులు జీవనశైలి మార్చుకొని ఆరోగ్యకరమైన జీవనం సాగించాలన్నారు. సౌదత్తిలో రూ.46 కోట్లతో మల్టిస్పెషలిటీ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. రామదుర్గ, కిత్తూరులో అత్యుధునిక ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు హాజరై రోగులకు వైద్య సేవలు అందించారు.