శివమొగ్గ : శివమొగ్గ తాలూకాలో శుక్రవారం సాయంత్రం చల్లటి వర్షం జల్లులు పడ్డాయి. వేసవి సమయం ప్రారంభం అవుతుండటంతో ఒక పక్క ఎండలు మండుతుండగా ప్రజలు ఎండలకు బయటకి రావడానికి కూడా భయపడుతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి సాయంత్రం సమయంలో జల్లులతో కూడిన వర్షం పడింది. శివమొగ్గ నగరానికి సమీపంలో ఉన్న బసవనగగూరు, సమీనకొప్ప, కేహెచ్‌బీ కాలనీ, హోసూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు గంట పాటు జల్లులతో కూడిన వర్షం పడింది. అనేక చోట్ల ఎండ లేకుండా మబ్బులు కమ్ముకున్నాయి. దాంతో ఇక్కడి ప్రజలు చల్లటి వాతావరణంలో ఎండ నుంచి కొంత మేరకు ఉపశమనం పొందారు.