హొసపేటె: గంగావతిలో బుధవారం ఉదయం అక్కడి కొప్పళ రోడ్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక వాణిజ్య దుకాణంలో మంటలు చెలరేగి దాదాపు రూ.కోటిన్నర విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. కొప్పళ రోడ్డులోని సీబీఎస్ సర్కిల్ సమీపంలోని పాత పాన్ షాపు సమీపంలో ఈ సంఘటన జరిగింది. దాదాపీర్‌కు చెందిన దుకాణంలో రైతులకు కొత్త జనరేటర్లు, వ్యవసాయ యంత్రాలు, ఇతర ఉపయోగకరమైన పరికరాలను విక్రయిస్తారు. అమ్మకాలు, మరమ్మతు(అమ్మకాలు, సేవ)ల కోసం ఉంచిన ఈ దుకాణంలో అమ్మకానికి కొత్త జనరేటర్లు ఉన్నాయి. అరగంట తర్వాత యజమానికి సమాచారం అందింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తలెత్తిన మంటలతో దుకాణం నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన స్థానికులు వెంటనే యజమానికి తెలిపారు. దాదాపీర్ స్థలానికి చేరుకునే సమయానికి దుకాణంలోని చాలా వస్తువులు మంటల్లో కాలి పోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. దుకాణంలోని కొత్త పరికరాలు, రైతులు మరమ్మతు కోసం ఇచ్చిన వ్యవసాయ పనిముట్లు చాలా వరకు కాలిపోయాయి. ఘటనపై అక్కడి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అగ్నిప్రమాదంలో దుకాణం బుగ్గి
అగ్నిప్రమాదంలో దుకాణం బుగ్గి