మద్యం, బీర్ల నూతన రికార్డు
శివాజీనగర: ఊరికే వేడుకలు చేసుకుంటే ఏం బాగుంటుంది, కొంచెం చుక్క పడితే మరింత హుషారొస్తుంది అని జనం అనుకోవడంతో.. కొత్త సంవత్సరం సంబరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కళకళలాడింది. మద్యం విక్రయాలు నింగినంటడంతో గత తొమ్మిది రోజుల్లో సుమారు రూ.1,319 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే 10 శాతం అధికమని తెలిసింది. బెంగళూరుతో సహా రాష్ట్రంలో అన్నిచోట్ల బీర్, మద్యం వినియోగం భారీగా సాగింది. మామూలు రోజుల్లో ప్రభుత్వానికి రూ. 65 – 70 కోట్ల రాబడి వస్తుంది. అయితే డిసెంబరు 30న ఒక్కరోజే రూ.261 కోట్ల ఆదాయం వచ్చింది.
విక్రయాలు ఇలా..
డిసెంబరులో 63.71 లక్షల బాక్సుల మద్యం, 36.14 లక్షల బాక్సుల బీర్లను తాగేశారు. అయితే మద్యం కంటే బీర్ల వాడకం ఎక్కువగా ఉంది.
బెంగళూరులో కూడా :
బెంగళూరు నగర జిల్లాలో మద్యం, బీర్లను ఎగబడి ఖాళీ చేశారు. చివరి మూడు రోజుల్లో రూ.247 కోట్ల మద్యం అమ్మకమైంది. ఇందులో శాఖకు రూ.181 కోట్ల ఆదాయం చేరింది. 2.48 లక్షల బాక్సుల ఐఎంఎల్, 2.20 లక్షల బాక్సుల బీర్లు అమ్ముడయ్యాయి.
న్యూ ఇయర్ వేడుకల్లో భారీగా వినియోగం
సర్కారుకు రూ.1,319 కోట్ల ఆదాయం


