హత్య కేసులో ముద్దాయిల అరె్‌స్ట్‌కు డిమాండ్
రాయచూరు రూరల్: ధార్వాడ జిల్లా హుబ్లీలో జరిగిన పరువు హత్య కేసులో ముద్దాయిలను అరె్‌స్ట్ చేయాలని అఖిల భారత జనవాది మహిళా విభాగం జిల్లాధ్యక్షురాలు శాంత డిమాండ్ చేశారు. శుక్రవారం హట్టి పోస్టాఫీస్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. ఎస్సీ వర్గానికి చెందిన వివేకానంద ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ఆరోపణలపై ఏడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా మాన్య పాటిల్‌ను తల్లిదండ్రులు హత్య చేయడాన్ని ఖండించారు. ఈ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి, వివేకానంద కుటుంబానికి పోలీస్ భద్రత కల్పించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో రమేష్, దురుగమ్మ, జయమ్మ, లక్ష్మి, సుమంగల, నాగరాజ్, రజియా, వహీదా బేగం, అంబమ్మలున్నారు.


