రాయచూరు రూరల్: విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్ మీదుగా మహబూబ్‌నగర్ వరకు నడుస్తున్న రైళ్లను రాయచూరు వరకు పొడిగించాలని జిల్లా కమ్మ వారి సంఘం డిమాండ్ చేసింది. బుధవారం నగరంలోని రైల్వే స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్‌కు కమ్మ వారి సంఘం అధ్యక్షుడు బి.ప్రసాద్ వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. రాయచూరు జిల్లాలో కృష్ణా, గోదావరి జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు అధికంగా నివసిస్తున్నందున ఆ ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్లను పొడిగించాలని కోరారు. మంత్రాలయం–మచిలీపట్నం, మంత్రాలయం–కాకినాడ రైళ్లను కూడా రాయచూరు వరకు పొడిగించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సింధనూరు–రాయచూరు, గదగ్–వాడి రైల్వే లైన్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. రాయచూరు నుంచి గూడ్స్‌షెడ్‌ను యరమరస్‌కు తరలించాలన్నారు. యశవంతపూర్ రైలును రాయచూరు మీదుగా నడపాలని, బెళగావి–మంగళూరు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలను పునఃప్రారంభించాలని కోరారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు, బసవరాజ్, హేమంత్, బాబూరావ్‌లున్నారు.