రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా గురుగుంట అమరేశ్వర జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఆలయం వద్ద దేవస్థాన సమితి అధ్యక్షుడు రాజా సోమనాథ్ నాయక్ పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. వందలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. మాజీ లోక్‌సభభ సభ్యుడు రాజా అమరేశ్వర నాయక్, మాజీ ఎమ్మెల్యేలు హొలగేరి, అమరేగౌడ బయ్యపూర్ తదితరులతో పాటు రాయచూరు, లింగసూగూరు, సింధనూరు, మాన్వి, కలబుర్గి, యాదగిరి, సురపుర, శహాపుర, కొప్పళ, గంగావతి తదితర చోట్ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా అమరేశ్వర జాతర