కల్తీ కల్లు సరఫరా.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లు సరఫరా.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

Mar 15 2025 12:15 AM | Updated on Mar 15 2025 12:15 AM

కల్తీ

కల్తీ కల్లు సరఫరా.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

రాయచూరు రూరల్‌: కల్తీ కల్లు సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎకై ్సజ్‌ శాఖాధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం నగరంలోని రైల్వేస్టేషన్‌ వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇందిరా నగర్‌కు చెందిన ఖాజా, మంగళవారపేటకు చెందిన కరియప్పల నుంచి 30 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తహసీల్దార్‌ సస్పెండ్‌కు డిమాండ్‌

రాయచూరు రూరల్‌: లింగసూగూరు తహసీల్దార్‌ శంశాలంను సస్పెండ్‌ చేయాలని దళిత సంఘర్ష సమితి సంచాలకుడు ప్రభులింగ డిమాండ్‌ చేశారు. శుక్రవారం లింగసూగూరు ఏసీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. కచేరిలో రూ.2 కోట్ల గోల్‌మాల్‌ విషయంలో తహసీల్దార్‌–2 వెంకటేష్‌ను సస్పెండ్‌ చేశారన్నారు. ప్రధానంగా శంశాలంను సస్పెండ్‌ చేసి పూర్వాపరాలపై దర్యాప్తు చేయాలన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి నిధులను స్వార్థానికి వాడుకున్న తహసీల్దార్‌పై విచారణ జరపాలన్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోని అర్చకులకు చెల్లించాల్సిన డబ్బులు, ప్రకృతి వైపరీత్య పరిహార నిధులను నకిలీ బిల్లులు సృష్టించి రూ.1.87 కోట్ల మేర ఇతర ఖాతాల్లోకి జమ చేసుకున్న అంశంపై విచారణలో వెల్లడైందన్నారు. తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలని కోరుతూ ఏసీ బసవణ్ణప్పకు వినతిపత్రం అందించారు.

బావిలో పడి వ్యక్తి మృతి

రాయచూరు రూరల్‌: నీరు తెచ్చేందుకు బావి దగ్గరకు వెళ్లిన ఓ కూలీ కార్మికుడు అందులో పడి మృతి చెందాడు. బీదర్‌ జిల్లా హులసూరు తాలూకా మదనాళ గ్రామానికి చెందిన సతీష్‌(40) అనే వ్యక్తి పొలం పనులు చేసుకుంటూ పక్కనే ఉన్న బావిలో మంచి నీరు తెచ్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడి ఈత రాకపోవడంతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై హులసూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లాలో మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖాధికారి రంగస్వామి శెట్టి వెల్లడించారు. శుక్రవారం తాలూకా విద్యా శాఖాధికారి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఏడు తాలూకాల్లో మొత్తం 97 కేంద్రాల్లో 33,906 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతారన్నారు. దేవదుర్గ తాలూకాలోని 15 కేంద్రాల్లో 4,660, లింగసూగూరు తాలూకాలోని 18 కేంద్రాల్లో 6,746, మాన్వి తాలూకాలోని 18 కేంద్రాల్లో 6,331, రాయచూరు తాలూకాలోని 27 కేంద్రాల్లో 9,912, సింధనూరు తాలూకాలోని 19 కేంద్రాల్లో 6,257 మంది విద్యార్థులున్నారని వివరించారు.

యోగి నారాయణ

ఆదర్శాలు అనుసరణీయం

బళ్లారిటౌన్‌: ప్రపంచానికే ఉత్తమ సందేశాన్ని చాటిన యోగి నారాయణ యతీంద్ర ఆదర్శాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవరుచుకొని సన్మార్గంలో పయనించాలని పాలికె మేయర్‌ ముల్లంగి నందీష్‌ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖ, పాలికె ఆధ్వర్యంలో నగరంలోని వడ్డరబండ బలిజ భవనంలో ఏర్పాటు చేసిన యోగినారాయణ యతీంద్ర కై వార తాత జయంతిని ప్రారంభించి మాట్లాడారు. దీన, దళిత, శోషిత వర్గాల అభివృద్ధికి కుల, మత, గోత్ర, వర్ణ బేధాలు లేకుండా శ్రమించారన్నారు. సత్యం విద్యా సంస్థ లెక్చరర్‌ ఆలం బాషా తదితరులు మాట్లాడారు. బలిజ సంఘం జిల్లాధ్యక్షుడు ఎస్‌ మురళీ కృష్ణ, కన్నడ సంస్కృతి శాఖ ఏడీ నాగరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

కల్తీ కల్లు సరఫరా..  ఇద్దరు నిందితుల అరెస్ట్‌ 1
1/4

కల్తీ కల్లు సరఫరా.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

కల్తీ కల్లు సరఫరా..  ఇద్దరు నిందితుల అరెస్ట్‌ 2
2/4

కల్తీ కల్లు సరఫరా.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

కల్తీ కల్లు సరఫరా..  ఇద్దరు నిందితుల అరెస్ట్‌ 3
3/4

కల్తీ కల్లు సరఫరా.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

కల్తీ కల్లు సరఫరా..  ఇద్దరు నిందితుల అరెస్ట్‌ 4
4/4

కల్తీ కల్లు సరఫరా.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement