అతనికి 40..ఆమెకు 19 | Tumakuru:19-Year-Old Student Found Dead In A Pond | Sakshi
Sakshi News home page

అతనికి 40..ఆమెకు 19

Jun 24 2024 1:08 AM | Updated on Jun 25 2024 1:23 PM

-

యువతిని తీసుకెళ్లిన వ్యక్తి 

 చెరువులో శవమై తేలిన యువతి 

గట్టుపై చెప్పులు, కారు

 అతను కూడా చెరువులో దూకి ఉంటాడని భావించి గాలింపు

తుమకూరు : అతనికి 40 సంవత్సరాలు.. పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 19 సంవత్సరాల యువతిని ఆకర్షించి వెంట తీసుకెళ్లాడు. ఏం జరిగిందో ఏమో ఆ యువతి చెరువులో శవమై తేలింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈఘటన తుమకూరు జిల్లా కొరటిగెరె తాలూకా మావత్తురుగ్రామంలో వెలుగు చూసింది. ఇదే తాలూకా కోళాల సమీపంలోని బైరగొండ్లు గ్రామానికి చెందిన రంగశ్యామయ్య(40), లక్ష్మయ్యన పాళ్య గ్రామానికి చెందిన ఆనన్య(21)లు ప్రేమికులు. రంగశ్యామయ్యకు ఇప్పటికే వివాహమైంది. 

ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అనన్య బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం అనన్య ఇంట్లో తెలిసింది. రంగశ్యామయ్యను వివాహం చేసుకుంటానని అనన్య పేర్కొనగా కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లి జరిగిన వ్యక్తితో వివాహం ఏమిటని మందలించారు. ఈక్రమంలో ఈ జంట మూడు రోజుల క్రితం ఊరు విడిచి వెళ్లింది.

 దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం మావత్తురు చెరువులో మహిళ శవం తేలియాడుతుండగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి పరిశీలించగా అనన్యగా గుర్తించారు. గట్టుపై ఇద్దరి పాదరక్షలు, కారు ఉన్నాయి. వీరిద్దరూ కారులో సంచరించినట్లు అనుమానిస్తున్నారు. రంగశ్యామయ్య కూడా ఇదే చెరువులో దూకి ఉంటాడని భావించి మృతదేహం కోసం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. అనన్య మృతదేహాన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement