త్వరలోనే రైతులకు పంట నష్టపరిహారం

పంట నష్టంపై రైతుల గోడు ఆలకిస్తున్న
మంత్రి చెలువరాయస్వామి, ఎమ్మెల్యే తుకారాం - Sakshi

బళ్లారిటౌన్‌: త్వరలోనే అనావృష్టితో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారాన్ని అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని సండూరు తాలూకాలో వివిధ గ్రామాల్లో అనావృష్టితో పంటలు దెబ్బతిన్న పొలాలను సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఈ వషయంపై కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఈ పంట నష్టపరిహారం పొందాలంటే ఫోర్త్‌ ఐడీ రైతులు తమ పేరున భూములను నమోదు చేసుకోవాలన్నారు. దీన్ని వల్ల పరిహారం పొందేందుకు అనుకూలం అవుతుందన్నారు. ఈ నెలాఖరులో కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం విడుదల కావచ్చన్నారు. కేంద్రం నుంచి నిధులు రాగానే సన్న, అతిసన్నకారు రైతులకు ఈ పరిహారాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సండూరు ఎమ్మెల్యే తుకారాం, జెడ్పీ సీఈఓ రాహుల్‌ శరణప్ప, వ్యవసాయ శాఖ జేడీ కే.మల్లికార్జున, డీడీలు కెంగేగౌడ, సంతోష్‌, తహసీల్దార్‌ పవన్‌కుమార్‌, ఏడీలు మంజునాథ, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top