
డప్పు వాయిస్తున్న హంపయ్య నాయక్
రాయచూరు రూరల్: విద్యార్థులు మానవతా విలువలను పెంచుకోవాలని మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్ అన్నారు. మంగళవారం నీరమాన్వి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రతిభా కారంజీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు పచ్చదనం, ప్లాస్టిక్ నిర్మూలనకు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గణితంపై భయం తగదు
రాయచూరు రూరల్: విద్యార్థులు గణితం సబ్జెక్ట్‌పై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని దేవదుర్గ తాలూకా విద్యా శాఖ అధికారి సుఖదేవ్ పేర్కొన్నారు. మంగళవారం అరికెరలోని ఆదర్శ పాఠశాలలో గణిత భవన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆర్యభట్ట ప్రావీణ్యం పొందిన గణితాన్ని ఉపాధ్యాయులు బోధిస్తున్నప్పుడు విద్యార్థులు క్రమశిక్షణతో వింటే చాలా సులభంగా అర్థమవుతుందన్నారు. అధికారులు శివరాజ్, అపర్ణ, మంజుల, కుమార స్వామి, చెన్నమల్లప్ప, మంజునాథ్, మల్లికార్జున పాల్గొన్నారు.
ప్రతిభ వెలికితీతకు
కారంజి దోహదం
బళ్లారిటౌన్: పాఠశాల పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రతిభా కారంజి, కళోత్సవ కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయని జిల్లా విద్యాఖ డీడీ బీ.ఉమాదేవి పేర్కొన్నారు. మంగళవారం కోట ప్రాంతంలోని సెయింట్‌జాన్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ప్రతిభా కారంజి కళోత్సవాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరిలోను ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందన్నారు. దానిని గుర్తించేందుకు ఇలాంటి వేదికలు ఎంతో దోహద పడతాయన్నారు. పిల్లలు పాఠాలతో పాటు పాఠ్యేతర కార్యక్రమాలకు కూడా ఎక్కువ ఆసక్తి కనబరిచేలా ఉపాధ్యాయులు తోడ్పడాలన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటి జిల్లాకు కీర్తి నప్రతిష్టలు తేవాలన్నారు. విద్యా సంస్థ వ్యవస్థాపకుడు వందనీయ ఫాదర్, వాల్తేర్ మేనేజర్స్ ప్రధాన ఉపాధ్యాయులు శాంతశీలన్, వివిధ తాలూకాల బీఈఓలు పాల్గొన్నారు.
డణాపుర పరిసరాల్లో
చిరుత ప్రత్యక్షం
హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా భాసిలుతున్న హంపీ సమీపంలోని డణాపుర పరిసరాల్లో చిరుత ప్రత్యక్షమైన ఘటన మంగళవారం జరిగింది. డణాపుర గ్రామ శివార్లలోని చెరుకు పొలం వద్ద చిరుత సంచారం రైతుల కంట పడటంతో గ్రామస్తులు, రైతులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తమ పొలాలకు వెళ్లాలన్నా అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని వెళ్లాల్సి వస్తోందని, వెంటనే అటవీ అధికారులను బోనును ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని రైతులు కోరారు.
నరేగ పనుల్లో
అవినీతిపై కేసు నమోదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కరువు నెలకొనడంతో వ్యవసాయ కూలీ కార్మికులకు గ్రామ స్థాయిలో ఉపాధి పనుల కల్పన కోసం ఏర్పాటు చేసిన నరేగ పథకంలో రూ.కోట్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(నరేగ) పథకంలో ఉపాధి కల్పించాల్సింది పోయి గత రెండేళ్లలో దేవదుర్గ తాలూకాలో నిధులు దిగమింగిన 95 మంది పీడీఓలు, 66 మంది గ్రామ పంచాయతీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీపీ అసిస్టెంట్ డైరెక్టర్ పంపాపతి, టీపీ ఈఓ బసణ్ణ నాయక్, 23 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులపై రూ.11 కోట్ల మేర నిధుల దుర్వినియోగంపై గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ పవన్ కుమార్ ఆదేశాల మేరకు ఇన్‌చార్జి టీపీ ఈఓ అణ్ణారావ్ ఫిర్యాదు చేశారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

గ్రామ పరిసరాల్లో తిరుగుతున్న చిరుత