
పంటలను పరిశీలిస్తున్న బీజేపీ కరువు అధ్యయన బృందం
దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకాలో బీజేపీ ఆధ్వర్యంలో కరువు అధ్యయనం బృందం పర్యటించింది. సోమవారం తాలూకాలోని హారోహళ్లి, చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించిన బీజేపీ కరువు అధ్యయన బృందం పంటలను స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వర్షాభావం, పంటలు ఎండిపోయి ఎంతమేర నష్టం జరిగిందో రైతులు వివరించారు. ఎమ్మెల్సీ కోటా శ్రీనివాసపూజారి ఆధ్వర్యంలోని కరువు అధ్యయన బృందం చివరగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత అధికారులతో కరువుపై చర్చించారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించి రైతులకు తగిన నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధీరజ్ మునిరాజు, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.