
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలో దీపావళి వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనం నిర్వహించిన పిదప సత్యసాయియజుర్ మందిరం వద్ద సత్యసాయి చిత్రపటానికి ట్రస్టీలు పూజలు నిర్వహించారు. విద్యార్థులు, ట్రస్ట్ ఉద్యోగులు, భక్తులు టపాసులు కాల్చి దీపావళి నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
గుజరాత్ సంవత్సర శోభ
ప్రశాంతి నిలయంలో గుజరాతీ భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గుజరాతీల నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సుమారు వెయ్యి మందికి పైగా గుజరాత్ సత్యసాయి భక్తులు పుట్టపర్తికి విచ్చేశారు. సోమవారం సాయంత్రం బాల భక్తులు సత్యసాయి మానవతా విలువలను వివరిస్తూ ప్రదర్శించిన నాటికలు ముగ్ధుల్ని చేశాయి.