ఆ డాలర్లు నకిలీవే!

డాలర్ల కట్టలతో సెల్మన్‌ - Sakshi

కిడ్నాప్‌ కేసులో క్లూ

బనశంకరి: ఇటీవల బెంగళూరు వీరణ్ణ పాళ్య రైల్వే గేటు వద్ద పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎస్‌కే సెల్మన్‌ అనే చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తికి సుమారు 3 మిలియనఅమెరికన్‌ డాలర్లు దొరకడం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత డబ్బును ఎవరు పడేసి ఉంటారు అనే ఉత్కంఠ అలముకొంది. ప్రస్తుతం ఆ నోట్లు నగర పోలీసు కమిషనరేట్‌లో భద్రపరిచారు. పోలీసులు వాటిని పరీక్షించగా అసలైన డాలర్‌ నోట్లు కాదని, కలర్‌ జిరాక్స్‌ పేపర్లని తెలిసింది. ఈ నెల 7 తేదీన తౌహిదుల్‌ ఇస్లాం అనే వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్‌ చేసి యుఎస్‌ కరెన్సీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తన వద్ద లేదని, పోలీసులకు అప్పగించానని అతడు చెప్పాడు. దీంతో 8 తేదీన న కిడ్నాపర్లు నాగవార తీసుకువచ్చి వదిలిపెట్టి వెళ్లారు. ఈ దందాలో ఉపయోగించిన నకిలీ నోట్లే ఇవి కావచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top