16వ అంతస్తు నుంచి పడి విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

16వ అంతస్తు నుంచి పడి విద్యార్థి మృతి

Published Sun, Nov 12 2023 1:22 AM

-

బనశంకరి: బెంగళూరులో సర్జాపురలో అజీం ప్రేమ్‌జీ యూనివర్శిటీలో బీఎస్సీ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థి హాస్టల్‌ 16వ అంతస్తు పై నుంచి పడి మృతి చెందాడు. హైదరాబాద్‌లో నేవీ విశ్రాంత ఉద్యోగి మనోహర్‌ నంబియార్‌ కుమారుడు ఎం.అశ్విన్‌ నంబియార్‌ (21) మృతుడు. శుక్రవారం ఉదయం యూనివర్శిటీలోని హాస్టల్‌లో ఈ దుర్ఘటన జరిగితే శనివారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి అనుకోకుండా భవనంపై నుంచి పడిపోయాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా, ఇంకేదైనా కారణముందా? అనేది తెలియరాలేదు. డెత్‌నోట్‌ వంటిది లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ విషయమై యూనివర్శిటీ నుంచి ఫోన్‌ వచ్చింది, మృతికి కారణాలు చెప్పలేదని మృతుని తండ్రి తెలిపారు.

Advertisement
 
Advertisement