
మాట్లాడుతున్న మంత్రి మహదేవప్ప
హుబ్లీ: ధార్వాడలోని ప్రభుత్వ హాస్టల్‌కు బుధవారం తనిఖీ కోసం వచ్చిన రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి హెచ్‌సీ మహదేవప్ప తన అంగరక్షకుడితో షూ తొడిగించుకున్న ఘటన నగరంలో చర్చనీయాంశమైంది. ధార్వాడలోని సప్తాపుర హాస్టల్‌కు వచ్చిన ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అధికారుల నుంచి వివరాలను సేకరించారు.
ఆ తర్వాత భోజనశాల, హాస్టల్‌లోని వివిధ విభాగాలకు వెళ్లి పరిశీలించారు. వంట గదిలోకి వెళ్లి తిరిగి వచ్చిన ఆయన అంగరక్షకుడి చేతతో షూ వేయించుకున్నాడు. హాస్టల్‌లోకి రావడానికి ముందు ఆయన షూను బయట వదిలారు. కాగా ఆయన వైఖరి సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై మంత్రి విలేకరులకు వివరణ ఇచ్చారు. నంజనగూడు ఉప ఎన్నికల వేళ ప్రచారం చేసేటప్పుడు నడుముకు దెబ్బ తగిలినందున తాను వంగలేనని, కూర్చొంటే త్వరగా లేవలేనని, అనారోగ్యం వల్లనే అలా చేయాల్సి వచ్చింది గాని ఎట్టి పరిస్థితిలో దురహంకారంతో కాదని స్పష్టం చేశారు.