ఇంట్లో పేలిన స్కూటర్‌ బ్యాటరీ | - | Sakshi
Sakshi News home page

ఇంట్లో పేలిన స్కూటర్‌ బ్యాటరీ

Oct 15 2023 12:52 AM | Updated on Oct 15 2023 8:30 AM

ఈ స్కూటర్‌ బ్యాటరీనే పేలింది - Sakshi

ఈ స్కూటర్‌ బ్యాటరీనే పేలింది

హోసూరు: హోసూరు సమీపంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీ పేలడంతో ఇంట్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. వివరాల మేరకు సూళగిరి ప్రాంతానికి చెందిన మునిరాజ్‌ (38)తన కుటుంబసభ్యులతో కలిసి హోసూరు సమీపంలోని కళుగొండపల్లి సుభాష్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ అదే ప్రాంతంలో సూపర్‌ మార్కెట్‌ను నిర్వహిస్తున్నాడు. గత మూడేళ్లుగా బ్యాటరీ స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాడు.

అర్ధరాత్రి విస్ఫోటం
శుక్రవారం రాత్రి 10 గంటలకు షాపును మూసివేసి ఇంటికి వచ్చిన దంపతులు స్కూటర్‌ బ్యాటరీని విప్పి ఇంట్లో చార్జింగ్‌కు పెట్టారు. అర్ధరాత్రి బ్యాటరీ గట్టి శబ్దంతో పేలడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. టీవీ, ఫ్యాన్‌, బల్పులతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు కాలిపోయాయి. ఇంటి పైకప్పు కూడా చీలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న మంజునాథ్‌, భార్య మాల (33), కొడుకు రక్షణ్‌ (11), కూతురు జయ్‌గంగ (8)లు విషవాయువుల మధ్యలో చిక్కుకుని ఉండగా, చుట్టుపక్కల వారు చేరుకొని ఇంటి తలుపులు బద్దలగొట్టి మంటలార్పి ప్రమాదంలో ఇరుక్కుపోయిన దంపతులను, పిల్లలను బయటకు తీశారు. అదృష్టవశాత్తు వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దుర్ఘటనపై బాధితుడు మత్తిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాలిపోయిన ఎలక్ట్రానిక్‌ పరికరాలు1
1/1

కాలిపోయిన ఎలక్ట్రానిక్‌ పరికరాలు

Advertisement
 
Advertisement
Advertisement