గగనచుక్కి కన్నీటి చారిక | - | Sakshi
Sakshi News home page

గగనచుక్కి కన్నీటి చారిక

Jul 12 2026 1:41 AM | Updated on Jul 12 2026 1:41 AM

ఇప్పుడు ఇలా కళా విహీనంగా దర్శనమిస్తోంది

గత ఏడాది ఉధృతంగా ప్రవహిస్తున్న గగనచుక్కి జలపాతం

మండ్య: మండ్య జిల్లాలోని మళవళ్లి తాలూకాలోని శివన సముద్రంలో కావేరి నదిపై ప్రసిద్ధి చెందిన గగనచుక్కి జలపాతం, వర్షాలు లేకపోవడం వల్ల బోసిపోయింది. మామూలుగా వర్షాలు అందుకుంటే జూలై నుంచి గగనచుక్కి హోరుమని గర్జిస్తూ జలపాతం నురగలు కక్కుతూ ప్రవహిస్తుంది. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివచ్చేవారు. 300 అడుగుల ఎత్తు కొండల మీద నుంచి జలపాతం దుమికే దృశ్యాలను కనువిందు చేస్తాయి.

కావేరి జలాలు కరువై

కావేరీ పరీవాహక ప్రాంతంలోని కృష్ణరాజ సాగర్‌, కబిని జలాశయాలకు మంచి వర్షాలు కురిసి, దండిగా నీరు చేరితే గగనచుక్కి జలపాతం విశ్వరూపం చూపిస్తుంది. కానీ ఈసారి, కావేరీలో వర్షాలు లేకపోవడం వల్ల నీటి ప్రవాహం తగ్గి, జలపాతం అంద విహీనమైంది. ఎండిపోయిన జలపాతాన్ని చూసి స్థానిక ప్రజలు బాధకు గురవుతున్నారు. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడే ఈ జలపాతం, ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్లతో నిండిన అడవిలా కనిపిస్తోంది. పర్యాటకులు లేక వెలవెలబోయింది. మామూలుగా ఈ జలపాతాన్ని చూడడానికి జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు ఉత్తమ సమయం. 2025లో ఫాల్స్‌ నేత్రపర్వం కలిగించింది.

వానలు లేక బోసిపోయిన ప్రసిద్ధ జలపాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement