అన్నదాత ఆక్రందన | - | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆక్రందన

Jul 12 2026 1:41 AM | Updated on Jul 12 2026 1:41 AM

ఎండిపోతున్న పంట తొలగింపు

ట్రాక్టర్‌తో పంటను తొలగిస్తున్న రైతు

హొసపేటె: వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నమ్ముకున్న వానలు ముఖం చాటేయడంతో పొలాల్లో పంటలు ఎండిపోతుండగా, గుండెలు బరువెక్కుతున్నాయి. ఎండిపోతున్న పొద్దు తిరుగుడు పంటను చూడలేక రైతు ట్రాక్టర్‌తో తొలగించారు. తుంగభద్ర నదీ తీరంలోనే జరిగింది. కొప్పళ తాలూకాలోని ముర్లపుర గ్రామంలో రైతు సురేష్‌ చన్నల్లి, 5 ఎకరాల పొలంలో సన్‌ఫ్లవర్‌ వేశారు. నెలన్నరగా వర్షాలు లేక పోవడంతో, పంట ఎండిపోయి వాడిపోతోంది. ఇక ఉపయోగం లేదని ట్రాక్టర్‌తో దున్ని నేలలోకి కలిపేశాడు. పంటలకు ఖర్చు చేసిన వేలాది రూపాయలు మట్టిలో కలిసిపోయాయని రైతు బాధపడ్డాడు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement