ఆవులను తరలిస్తున్న దృశ్యం
దొడ్డబళ్లాపురం: అక్రమంగా తరలిస్తున్న గోవులను శ్రీరామసేన కార్యకర్తలు రక్షించారు. కేఎం దొడ్డి నుండి చింతామణికి బెంగళూరు–మైసూరు రహదారి మార్గంలో క్యాంటర్‌లో అక్రమంగా జీవాలు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న శ్రీరామసేన కార్యకర్తలు జయపుర గేట్ వద్ద కాపుకాచి వాహనాన్ని అడ్డుకున్నారు. క్యాంటర్‌లో ఉన్న 11 జీవాలను రక్షించి రామనగర పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి క్యాంటర్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్ చేసి జీవాలను సమీపంలోని గోశాలకు తరలించారు.
విశ్వకర్మ సముదాయ
సంక్షేమానికి కృషి
మైసూరు: సమాజంలో విశ్వకర్మల పాత్ర కీలకమని ఎమ్మెల్యే హరీష్ గౌడ అన్నారు. మండ్య జిల్లా యంత్రాంగం, కన్నడ సంస్కృతి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని కళా మందిరంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూజలు చేసి మాట్లాడారు. విశ్వకర్మ సముదాయ సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.


