అన్నాదురై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం
హోసూరు: డీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత అన్నాదురై వర్థంతిని పురస్కరించుకొని హోసూరు పట్టణంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. పట్టణంలోని తాలూకా కార్యాలయం వద్ద మేయర్ ఎస్.ఏ.సత్య అధ్యక్షతన వర్థంతి కార్యక్రమాన్ని జరుపుకొన్నారు. అన్నా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నాదురై రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ ఆనందయ్య, వేపనపల్లి మాజీ ఎమ్మెల్యే మురుగన్, పట్టణంలోని డీఎంకే కార్పొరేటర్లు, డీఎంకే నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కెలమంగలం, డెంకణీకోట, బాగలూరు, బేరికె, సూళగిరి, అంచెట్టి తదితర ప్రాంతాల్లో డీఎంకే నాయకులు అన్నాదురై చిత్రపటానికి పూలమాలలు వేసి వర్థంతిని జరుపుకొన్నారు.


