సంతాన ‘వైఫల్య చికిత్స’? | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ చేస్తుండగా మహిళ మృతి

Sep 4 2023 12:46 AM | Updated on Sep 4 2023 9:09 AM

- - Sakshi

తుమకూరు: ఆపరేషన్‌ చేయించుకునేందుకు వచ్చిన ఒక మహిళ హఠాత్తుగా మరణించగా వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదేళ్ల క్రితం అరుణ్‌ అనే వ్యక్తితో మానస (30)కు వివాహం జరిగింది. ఆమె తుమకూరులోని విశ్వవిద్యాలయంలో గెస్ట్‌ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. సంతానం కలగకపోవడంతో మానస తుమకూరు మహాలక్ష్మినగరలో చిన్మయ నర్సింగ్‌ హోంలోని ఫెర్టిలిటీ సెంటర్‌లో నెలన్నర రోజులుగా చికిత్స పొందుతోంది.

గర్భాశయంలో 3 గ్రాముల గడ్డ ఉందని, దాన్ని ఆపరేషన్‌ చేసి తీయాలని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే ఈనెల 1న ఆపరేషన్‌ చేయించేందుకు ఆస్పత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2వ తేదీన బెంగళూరుకు చెందిన డాక్టర్‌ శశికళ ఆపరేషన్‌ చేస్తుండగా మానస మృతి చెందింది. మానస చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తుమకూరు కొత్తలేఔట్‌ పోలీసు స్టేషన్‌లో మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement