ప్రయాణికురాలిపై క్యాబ్‌ డ్రైవర్‌ దాడి | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికురాలిపై క్యాబ్‌ డ్రైవర్‌ దాడి

Aug 11 2023 7:18 AM | Updated on Aug 11 2023 7:57 AM

మహిళను కొడుతుండగా అడ్డుకుంటున్న తనయుడు  - Sakshi

మహిళను కొడుతుండగా అడ్డుకుంటున్న తనయుడు

అంతలోనే కుమారుడు మరో క్యాబ్‌ను బుక్‌ చేశాడు. ముందు వచ్చిన క్యాబ్‌లోకి ఎక్కారు, అయితే కుమారుడు ఇది మనం బుక్‌ చేసిన క్యాబ్‌ కాదని చెప్పాడు.

కృష్ణరాజపురం: బెంగళూరులో ఉబర్‌ డ్రైవర్‌ దారుణానికి పాల్పడ్డాడు, ప్రయాణికురాలపై దాడి చేసిన ఘటన నగరంలోని బెళ్లండూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బోగనహళ్లిలో చోటు చేసుకుంది. బాధిత మహిళ తన కుమారున్ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి క్యాబ్‌ బుక్‌ చేసుకుంది. అంతలోనే కుమారుడు మరో క్యాబ్‌ను బుక్‌ చేశాడు. ముందు వచ్చిన క్యాబ్‌లోకి ఎక్కారు, అయితే కుమారుడు ఇది మనం బుక్‌ చేసిన క్యాబ్‌ కాదని చెప్పాడు.

క్యాబ్‌ డ్రైవర్‌ వారిని దించి ఆమెతో గొడవ పడ్డాడు. ఆమైపె చేయి చేసుకోవడంతో సమీపంలోని అపార్టుమెంట్‌ వాసులు వచ్చి కాపాడారు. ఇంతలో డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement