● స్టింగ్ కేసులో అరెస్టు భయమే అని ప్రచారం
శివాజీనగర: సిద్దరామయ్యపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ కేసులో ఆరోపణలొచ్చిన మంగళూరు కాంగ్రెస్ నాయకురాలు కృపా ఆళ్వా ఆకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. స్టింగ్ వీడియోల కేసులో ఇటీవల నగర సీసీబీ పోలీసులు ఆమెను సుదీర్ఘంగా విచారించారు. ఏం జరిగిందో అన్ని వివరాలు నమోదు చేసుకున్నారు, ఎప్పుడు పిలిచినా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించి ఆమెను పంపించివేశారు. ఈ నేపథ్యంలో కృపా ఆళ్వా మొదట బెంగళూరు నుంచి జపాన్‌కు, అక్కడి నుండి అమెరికాకు వెళ్లారని గుప్పుమంది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆమె ముందస్తు బెయిల్ అర్జీ కూడా దాఖలు చేయకుండా విమానం ఎక్కారని సమాచారం.
కృపా


