తండ్రీ కొడుకులకు చరిత్ర తెలియదా? | - | Sakshi
Sakshi News home page

తండ్రీ కొడుకులకు చరిత్ర తెలియదా?

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

మైసూరు: ‘మాజీ సీఎం సిద్దరామయ్య, ఆయన కుమారుడు, మంత్రి యతీంద్ర మైసూరు చరిత్ర తెలియదన్నట్లు మాట్లాడుతున్నారు. జిల్లా మంత్రి కనీసం మైసూరు చరిత్రనైనా చదవాలి. ఆయనకు మైసూరు రాజకుటుంబ నేపథ్యం తెలిసి ఉండాలి’ అని సీనియర్‌ ఎమ్మెల్సీ హెచ్‌. విశ్వనాథ్‌ ఘాటుగా విమర్శించారు. దసరా ఉత్సవాల గురించి మైసూరు ప్యాలెస్‌ డీకే సర్కారుపై ఆరోపణలు గుప్పించడం, మళ్లీ యతీంద్ర విమర్శించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నగరంలో విలేకరుల సమావేశంలో విశ్వనాథ్‌ మాట్లాడారు. మంత్రి డాక్టర్‌ యతీంద్ర మైసూరు రాజకుటుంబం గురించి చాలా చులకనగా మాట్లాడారని అన్నారు. అనుభవం లేని వారికి బాధ్యతలు అప్పగిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ సరిగ్గానే మాట్లాడారన్నారు. గతంలో చాముండేశ్వరి ఉప ఎన్నిక ప్రచారానికి రావాలని మేము శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయార్‌ను కోరాము, ఆ రోజు మహారాజు ప్రచారానికి రాకపోయి ఉంటే, సిద్దరామయ్య గెలిచి ఉండేవారు కాదు. ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు కాదు అని వివరించారు.

ఎమ్మెల్సీలు గెలవగానే అయిపోదు

తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లు గెలిచాయి, ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు మాత్రమే ఓటు వేశారు. అప్పుడే అధికారంలోకి వచ్చేస్తామని బి.వై.విజయేంద్ర, ఆర్‌.అశోక్‌, కేంద్ర మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి ఘోషిస్తున్నారని విశ్వనాథ్‌ ఎద్దేశా చేశారు. ప్రధాని మోదీ ఎన్నికై న వారణాసి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోగా, సమాజ్‌వాదీ పార్టీ గెలిచిందని, దీనికేమంటారన్నారు.

బాంబే డేస్‌ను విడుదల చేయను

నేను బాంబే డేస్‌ పుస్తకాన్ని పూర్తిగా రాశాను. కానీ దానిని ప్రచురించకూడదని నిర్ణయించుకున్నాను. ఆ పుస్తకాన్ని విడుదల చేస్తే ప్రజలకు రాజకీయాలపై మరింత విరక్తి కలుగుతుందని విశ్వనాథ్‌ అన్నారు. అందుకే బాంబే డేస్‌ పుస్తకాన్ని విడుదల చేయను అన్నారు. గతంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండగా పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు ముంబైకి వెళ్లిపోయి క్యాంపు వేయడం, కుమార సర్కారు పడిపోవడం తెలిసిందే. ఆ క్యాంపులో విశ్వనాథ్‌ కూడా ఉన్నారు.

మైసూరు రాజకుటుంబాన్ని

అలా మాట్లాడతారా?

సిద్దరామయ్య, యతీంద్రలపై

ఎమ్మెల్సీ విశ్వనాథ్‌ ధ్వజం

వివాదంలో ప్యాలెస్‌కు బాసట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement