యువతిపై టెక్కీల అత్యాచారం | - | Sakshi
Sakshi News home page

యువతిపై టెక్కీల అత్యాచారం

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

ఫ్లాట్‌కు వచ్చిన ప్రేమజంట..

కృష్ణరాజపురం (బెంగళూరు): ఈ క్రైం సీన్‌.. ఓటీటీలో వచ్చే సినిమాలకు మించి ఉంటుంది. బెంగళూరులోని మారతహళ్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే, అందుకు ప్రతీకారంగా వారిని కిడ్నాప్‌ చేసి హింసించిన కేసు వెలుగు చూసింది.

ప్రేయసితో గడపాలని వస్తే..

ఫిర్యాదులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మారతహళ్లిలోని ఓ అపార్టుమెంటు ఫ్లాట్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లికి చెందిన టెక్కీలు మహేంద్ర, తరుణ్‌, మంజునాథ్‌ ఉంటున్నారు. గత శనివారం మంజునాథ్‌ మదనపల్లికి వెళ్లాడు. ఆ సమయంలో మంజునాథ్‌కు బెంగళూరుకు చెందిన రాజ్‌కుమార్‌ అనే స్నేహితుడు ఫోన్‌ చేసి తాను ప్రియురాలితో నీ ఫ్లాట్‌లో గడుపుతానని చెప్పగా సరేనన్నాడు. దీంతో ఆ జంట శనివారం సాయంత్రం ఫ్లాటులోని ఓ గదిలో బస చేశారు. మహేంద్ర, తరుణ్‌ మరో గదిలో ఉన్నారు. ఆ యువతిని కాల్‌గర్ల్‌గా భావించిన మహేంద్ర, తరుణ్‌ మద్యం మత్తులో అర్ధరాత్రి వేళ రాజ్‌కుమార్‌ను గది నుంచి బయటకు పిలిచి, అతనిని తమ గదిలో బంధించారు. యువతిపై అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారుజామున 4:30 గంటల మధ్య అత్యాచారానికి పాల్పడ్డారు.

అపహరించి.. చితకబాది..

ప్రతీకారంగా కిడ్నాప్‌ చేసి దాడి

బెంగళూరు మారతహళ్లిలో సినిమాను తలపించే ఘటనలు

యువతి సహా 11 మంది, టెక్కీల అరెస్టు

మహేంద్ర తండ్రికి ఫోన్‌..

తర్వాత కిడ్నాపర్లు మదనపల్లిలోని మహేంద్ర తండ్రికి ఫోన్‌ చేసి నీ కొడుకుని కిడ్నాప్‌ చేశామని, తమకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంటనే 112కు ఫోన్‌ చేసి పోలీసులకు తెలిపాడు. అప్రమత్తమైన మారతహళ్లి పోలీసులు సీసీ కెమరాలను పరిశీలించారు. చివరకు నాగరబావిలోని ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు నిందితులను, ఇద్దరు యువకులను పట్టుకున్నారు. కిడ్నాప్‌, హత్యాయత్నం కేసులో యువతితో సహా మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు దొరకాల్సి ఉంది. ఇక యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో టెక్కీలు మహేంద్ర, తరుణ్‌లను కూడా అరెస్టు చేశారు.

ఆదివారం ఉదయం యువతిని బెదిరించి జంటను పంపేశారు. తనకు అన్యాయం జరిగిందని యువతి రగిలిపోయింది. ఇలా జరిగిందని మంజునాథ్‌కు రాజ్‌కుమార్‌ చెప్పగా అతడు షాక్‌కు గురయ్యాడు. బాధిత యువతి, రాజ్‌కుమార్‌, మంజునాథ్‌ కలిసి.. మదనపల్లిలో తమకు తెలిసిన లోకనాథ్‌, సొహైల్‌ తదితరులతో మాట్లాడి దాడికి పథకం వేశారు. బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో వచ్చిన మదనపల్లి ముఠా మహేంద్రను అతని గది నుంచి కిడ్నాప్‌ చేశారు. మహేంద్ర మొబైల్‌ ఫోన్‌ను గదిలోనే మరిచిపోయాడు. తరుణ్‌ నైట్‌ షిఫ్ట్‌ పూర్తి చేసుకుని రాగా, అతనిని కూడా అపహరించుకెళ్లారు. వారిని నిర్మానుష్య ప్రాంతానికి పిలుచుకెళ్లిన దుండగులు బట్టలు విప్పించి చితకబాదారు. ఇద్దరినీ హత్య చేసి ఆత్మహత్య కింద డెత్‌నోట్‌ రాయాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement