సాహుకార్‌ ఆప్త రియల్టర్‌పై ఈడీ దాడి | - | Sakshi
Sakshi News home page

సాహుకార్‌ ఆప్త రియల్టర్‌పై ఈడీ దాడి

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

బనశంకరి: కేపీఎస్‌సీ ఉద్యోగాల కుంభకోణంలో ఈడీ అధికారులు ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్‌ అక్రమాలపై లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. సాహుకార్‌ ఒకే ఏడాదిలో రూ.10 కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడినట్లు తెలిసింది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి నుంచి 2025 అగస్టు, డిసెంబరు మధ్య రూ.4.99 కోట్లు తీసుకున్నట్లు కనిపెట్టారు. దీంతో ఆ రియల్టరు అయిన ఎస్‌పీ దయానంద్‌ బెంగళూరు నివాసం, ఆఫీసుల్లో గురువారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అతని కారులో ఫైళ్లు, డైరీని స్వాధీనం చేసుకున్నారు.

ఇంట్లోకి చెత్త వేసిన

పౌర కార్మికులు

దొడ్డబళ్లాపురం: పౌర కార్మికులతో ఓ మహిళ గొడవపడిందని ఆమె ఇంటి ఆవరణలోకి చెత్త ట్రాక్టర్‌ను గుమ్మరించారు. ఈ సంఘటన నెలమంగల వీవర్స్‌ కాలనీలో జరిగింది. పుట్టమ్మ అనే మహిళ తన ఇంటి ముందు చెత్త సరిగా తీయడం లేదని పౌర కార్మికులతో వాగ్వాదానికి దిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన పౌర కార్మికులు ట్రాక్టర్‌తో చెత్త తీసుకువచ్చి మొత్తం ఇంటి గేటు ముందు పోసేశారు. ఆ మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వివాదం సద్దుమణిగింది.

నమో వైద్యనాథేశ్వరా..

కోలారు: ముళబాగిలు తాలూకా దేవరాయసముద్ర గ్రామంలో ఉన్న పురాణ ప్రసిద్ధ శ్రీ తైలాంభ సమేత శ్రీ వైద్యనాథేశ్వర స్వామి దేవాలయంలో గురువారం స్వామివారికి విశేష పూజలు, సోమసూత్ర, మహా కుంభాభిషేకం నెరవేర్చారు. అర్చకులు శరవణ నేతృత్వంలో 3 రోజుల నుంచి విశేష అర్చనలు సాగుతున్నాయి. దేవాలయాన్ని పచ్చని తోరణాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం తరలివచ్చి అమ్మవారిని, స్వామిని దర్శించుకున్నారు.

ఫిబ్రవరి 27 నుంచి ద్వితీయ పీయూసీ పరీక్షలు

దొడ్డబళ్లాపురం: కర్ణాటక స్కూల్‌ ఎగ్జామినేషన్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ బోర్డు పీయూసీ సెకెండియర్‌ పరీక్షల టైమ్‌టేబుల్‌ను ప్రకటించింది. 2027 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు పరీక్ష ముగుస్తుంది.

ఏ పరీక్ష ఎప్పుడు..

మొదటి రోజు కన్నడ, అరబిక్‌ భాషా పరీక్షలు, మార్చి 1న ఇంగ్లీష్‌, 2న తమిళం, మళయాళం, మరాఠీ, ఉర్దూ, సంస్కృతం, ఫ్రెంచ్‌ పరీక్షలు, 3న–భూగోళ శాస్త్రం, 4న– సమాజ శాస్త్రం, 5–గణితం, 8న– కెమిస్ట్రీ, 10వ తేదీన –హిందూస్తానీ సంగీతం, ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్‌, గార్మెంట్‌ మేకింగ్‌, హోం ఫర్నిషింగ్‌ పరీక్షలు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement