శివాజీనగర: దాదాపు పదేళ్లుగా న్యాయపోరాటం సాగుతున్న 2011 నాటి గెజిటెడ్ ప్రొబేషనరీ నియామకాల వివాదంలో సుప్రీంకోర్టు అనూహ్యమైన తీర్పును వెలువరించింది. ఈ వ్యవహారంలో 362 మంది అధికారులను కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది ప్రభుత్వంతో పాటు ఉద్యోగాలు చేసుకుంటున్న 362 మంది అధికారులకు తీవ్ర ఎదురుదెబ్బగా మారవచ్చు.
కేసు ఏమిటంటే..
2011లో కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఉన్నతోద్యోగాల నియామకాల్లో మార్కులు, ఇంటర్వ్యూలలో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులు కోర్టుల్లో కేసులు వేశారు. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన అధికారుల జాబితాను హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న అధికారులను కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఒక ప్రత్యేక చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టాన్ని హైకోర్టు సమర్థించింది.
సుప్రీంలో సవాల్ చేయగా..
ప్రభుత్వ చట్టాన్ని, హైకోర్టు ఉత్తర్వును పిటిషనర్ శ్రీనివాస్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కొంతకాలంగా దీనిపై విచారణ సాగుతోంది. గురువారం జస్టిస్‌లు జే.బీ.పర్దివాలా, వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ జరిపి పై తీర్పును ప్రకటించింది. ప్రభుత్వ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, చెల్లదని చెబుతూ ఆ చట్టాన్ని రద్దు చేసింది.
రాష్ట్ర సర్కారుకు, ఆ అధికారులకు
ముచ్చెమటలు
ఢిల్లీలో సుప్రీం కోర్టు
2011 కేపీఎస్‌సీ ఉన్నతోద్యోగాల
నియామకాల్లో అక్రమాల కేసు..
వారిని కాపాడే రాష్ట్ర ప్రభుత్వ చట్టం చెల్లదు
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
362 మందికి అగమ్య గోచరం
వివిధ శాఖలలో ముఖ్యమైన పోస్టుల్లో ఉన్న 362 మంది అఽధికారుల భవిష్యత్తు ఇప్పుడు అనిశ్చితంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ఆ నియామకాలను ప్రభుత్వం రద్దు చేస్తుందా; లేక వారినే కొనసాగించేలా ఇంకేమైనా చర్యలు చేపడుతుందా? అనేది సస్పెన్స్‌గా మారింది.
రాష్ట్రంలో కేపీఎస్‌సీపై ఉన్న ఆరోపణలు, ఉద్యోగాల కుంభకోణాలు నిరుద్యోగులకు తీవ్ర నిరాశ కలిగిస్తున్న సమయంలో మరో కొలువుల గలాటాలో సంచలన తీర్పు వెలువడింది. దీంతో వందలాది ఉన్నతాధికారుల జీవితం డోలాయమానంలో పడిపోయింది. వారి ఉద్యోగాలు ఉంటాయా, ఊడిపోతాయా? అనేది సర్కారుపై ఆధారపడి ఉంది.


