నా భార్య దొంగతనాలు చేస్తోంది..  | - | Sakshi
Sakshi News home page

చోరీలు చేస్తోందని.. భార్య హత్య

Aug 9 2023 7:14 AM | Updated on Aug 9 2023 9:37 AM

భార్యభర్తలు (ఫైల్‌)   - Sakshi

భార్యభర్తలు (ఫైల్‌)

తనకు చెడ్డపేరు తెస్తోందని కట్టుకున్న భార్యను భర్త హత్య చేసిన సంఘటన నగరంలోని మహాదేవపుర పరిధిలోని వైట్‌ఫీల్డ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

కృష్ణరాజపురం: తనకు చెడ్డపేరు తెస్తోందని కట్టుకున్న భార్యను భర్త హత్య చేసిన సంఘటన నగరంలోని మహాదేవపుర పరిధిలోని వైట్‌ఫీల్డ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సరిత (35)ను భర్త తారానాథ్‌ హత్య చేశాడు. మంగళూరుకు చెందిన ఈ దంపతులు వైట్‌ఫీల్డ్‌ పానీపూరి షాపు నిర్వహించేవారు.

భార్య స్థానికంగా చిన్న చిన్న చోరీలకు పాల్పడేది. దాంతో అందరూ ఆమెను దొంగ అని ప్రచారం చేయసాగారు. ఈ బాధను తట్టుకోలేక తారానాథ్‌ భార్యను హత్య చేయడానికి అనేకసార్లు ప్రయత్నం చేశాడు. ఈసారి గొంతుకు తాడు బిగించి చంపేశాడు, తరువాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేయడానికి యత్నించి చివరకు పోలీసు స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. వైట్‌ఫీల్డ్‌ పోలీసలు పరిశీలించి కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.

నా భార్యదొంగ 

Advertisement
 
Advertisement
Advertisement